-
-
Home » Andhra Pradesh » Guntur » RDO VERIFIES HOSPITALS FOR ISOLATION
-
ఐసొలేషన్‌కు అనుకూలమేనా...
ABN , First Publish Date - 2020-03-23T08:19:10+05:30 IST
ప్రత్తిపాడు మండలంలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ఉన్న వైద్యశాలను ఆర్డీవో భాస్కర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. కరోనాకు సంబంధించి ఇక్కడ అత్యవసరంగా...

- విశ్వనగర్‌లోని వైద్యశాలను పరిశీలించిన ఆర్డీవో
ప్రత్తిపాడు, మార్చి 22: ప్రత్తిపాడు మండలంలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ఉన్న వైద్యశాలను ఆర్డీవో భాస్కర్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. కరోనాకు సంబంధించి ఇక్కడ అత్యవసరంగా ఐసొలేషన్, క్వారంటైన్‌లను ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఊరికి దూరంగా కొండల మధ్య సువిశాల ప్రదేశంలో ఉన్న విశ్వనగర్ ఆవరణలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు అన్ని రకాల వసతులతో బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. అంతే కాకుండా అత్యాదునిక వైద్య పరికరాలు కూడా ఇక్కడఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ వార్డులు ఏర్పాటుపై ఆయన స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.