అమరావతితోనే నిజమైన పండుగ

ABN , First Publish Date - 2020-12-26T05:40:40+05:30 IST

అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని పాలకుల నుంచి ప్రకటన వచ్చినప్పుడే తమకు నిజమైన పండుగని రాజధాని దళిత జేఏసీ సభ్యులు తెలిపారు.

అమరావతితోనే నిజమైన పండుగ
తుళ్లూరు శిబిరంలో నిరాహార దీక్ష చేస్తున్న దళిత జేఏసీ సభ్యులు

తుళ్లూరు శిబిరంలో దళితుల ఉపవాస దీక్ష

ఏడాదిగా పర్వదినాలకు దూరమయ్యాం

374వ రోజుకు చేరినఅమరావతి రైతుల ఆందోళనలు


 తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, డిసెంబరు 25: అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగిస్తామని పాలకుల నుంచి ప్రకటన వచ్చినప్పుడే  తమకు నిజమైన పండుగని రాజధాని దళిత జేఏసీ సభ్యులు తెలిపారు. ఏకైక రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారంతో 374వ రోజుకు చేరుకున్నాయి. క్రీస్తు జన్మదినం, ముక్కోటి ఏకాదశి, ముస్లింల పవిత్ర శుక్రవారం ఒకే రోజు కావటంతో రైతుల శిబిరాల వద్ద సర్వ మత ప్రార్థనలు నిర్వ హించారు.  తుళ్లూరులో రాజధాని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ ఆధ్వర్యంలో దళితులు ఉపవాస దీక్ష చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి పర్వదినాలకు అమరావతి రైతుల కుటుం బాలు దూరమయ్యాయన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు ఇస్తే అభివృద్ధి చేయాల్సిన ప్ర భుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా ఒక సెంటు స్థలంలో ఇల్లు కడతామని పేదలను మభ్య పెడుతున్నారన్నారు. రాజధానిలో పేదలకు కట్టిన 5 వేల ఇళ్లు ఇవ్వ కుండా మోసం చేశారన్నారు. అమరావతిని నాశనం చే యాలని పాలకులు పూనుకున్నప్పుడే  ప్రభువైన ఏసు క్రీస్తు శిక్ష ఖరారు చేశారని దళిత జేఏసీ సభ్యులు తెలిపారు.   


అనంతవరం ఆలయం వరకు పాదయాత్ర 

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తుళ్లూరు రైతులు దీక్షా శిబిరం నుంచి అనంతవరం వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి షేక్‌ రిజ్వానా, రైతులు, మహిళలు, రైతులు  స్వామికి పొంగళ్లు సమర్పిం చి అమరావతి ఏకైక రా జధానిగా కొనసాగాలని మొ క్కుకున్నారు. రైతు శిబిరాల వద్ద హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా  సమానమని, సర్వ మతాల రాజధాని అమరావతి అంటూ రంగవల్లులతో మహిళలు అలంకరించారు.


  - తాడేపల్లి మండలం పెనుమాక, మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతులు చేపట్టిన దీక్షలు  374వ రోజుకు చేరాయి. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల రైతులు, మహిళలు క్రిస్మస్‌ పండుగరోజు కూడా నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజధానికి భూములు ఇవ్వటం రైతులు చేసిన తప్పా అని ప్రశ్నించారు.   

Updated Date - 2020-12-26T05:40:40+05:30 IST