అమరావతే మా ఆకాంక్ష

ABN , First Publish Date - 2020-12-20T05:14:10+05:30 IST

అమరావతే తమ ఆకాంక్ష అని రైతులు, మహిళలు తెలిపారు. రాజధాని కోసం చివరి వరకు పోరాటం చేస్తామన్నారు.

అమరావతే మా ఆకాంక్ష
కృష్ణాయపాలెం దీక్షా శిబిరంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలు

రాజధాని కోసం చివరి వరకు పోరాటం

368వ రోజుకు చేరుకున్న ఆందోళనలు 


తుళ్లూరు, తాడికొండ, తాడేపల్లి, మంగళగిరి క్రైమ్‌, డిసెంబరు 19: అమరావతే తమ ఆకాంక్ష అని రైతులు, మహిళలు తెలిపారు. రాజధాని కోసం చివరి వరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు శనివారం 368వ రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, రాయపూడి, వెలగపూడి, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, మందడం, ఐనవోలు తదితర గ్రామాల్లోని రైతు శిబిరాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమం ఇక్కడే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ, కర్నూలులో చేయవచ్చు కదా అన్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి అంటూనే అమరావతి రాజఽధానిలో పేదలకు ఇళ్ల స్థలం కావాలని అడుగడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీలో నిరసనలు వ్యక్తం చేస్తున్న రైతులను కేంద్రం పలుమార్లు చర్చలకు పిలిచిందని, 33 వేల ఎకరాలు ఇచ్చిన రాజధాని అమరావతి రైతులు మనోవేదనతో చనిపోతుంటే కనీస పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో కాదు, విశాఖలో పాలకులు కొన్న భూములపై విచారణ జరగాలన్నారు. పెదపరిమి శిబిరంలో ఎన్నారై మన్నెం శ్రీనివాసరావు మాస్కులను పంపిణీ చేసి రైతులకు సంఘీభావం తెలిపారు. తుళ్లూరులో జరిగిన ఓ శుభకార్యంలో జై అమరావతి  ప్లకార్డులు ప్రదర్శించారు. రాత్రి 7 గంటలకు అమరావతి వెలుగు కార్యక్ర మాన్ని నిర్వహించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, బేతపూడి, నీరుకొండ గ్రామాల్లో దీక్షలు కొనసాగించారు.తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో  రైతుల నిరసన దీక్షలు కొనసాగాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహి ళలు నిరసనలు వ్యక్తం చేశారు. 


Updated Date - 2020-12-20T05:14:10+05:30 IST