ఉద్యమానికి కదలిరండి

ABN , First Publish Date - 2020-12-14T05:04:06+05:30 IST

అమరావతి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రైతులు మహిళలు, కోరారు. ఆదివారం తుళ్లూరులో ఇంటింటి కీ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉద్యమానికి కదలిరండి
వెంకటపాలెంలో మోకాళ్లపై నిలబడి నిరనస తెలియజేస్తున్న మహిళలు

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి..

అమరావతిని కాపాడండి 

362వ రోజుకు చేరుకున్న  రైతుల ఆందోళనలు


తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి, డిసెంబరు 13: అమరావతి ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రైతులు మహిళలు, కోరారు. ఆదివారం తుళ్లూరులో ఇంటింటి కీ అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి అమరావతిని కాపాడుకోవటానికి ఉద్యమంలోకి రావాలని కోరారు. రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం ఆదివారం 362వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి రాజధానిని నిర్వీర్యం చేస్తున్న పాలకులు ఒక్క నిమిషం ఆలోచించాలన్నారు. మూడు రాజధానులతో ప్రయోజనం లేదన్నారు. ఈ మూడు ముక్కల ఆటతో రాష్ట్ర భవి ష్యత్‌ ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. ఐదు కోట్ల మంది అమరావతిని కోరుతుంటే, పాలకులు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతిని బలి చేస్తున్నారన్నారు. తుళ్ళూరు, రాయపూడి, దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మందడం, ఐనవోలు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు తదితర గ్రామాల్లో రైతుల శిబిరాల ఆందోళనలు కొనసాగాయి. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగాలని ఉద్యమం చేస్తున్నారు. మంగళగిరి మండ లం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడ మర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతుల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆయా దీక్షా శిబిరాలను రైతు సంఘ నేతలు సందర్శించి మద్దతు తెలిపారు.  తాడేపల్లి మండలం పెను మాక గ్రామంలో ఆందోళన కొనసాగింది. 


Updated Date - 2020-12-14T05:04:06+05:30 IST