రాష్ట్రం కోసమే..భూములిచ్చాం

ABN , First Publish Date - 2020-12-12T05:18:03+05:30 IST

రాష్ట్రం కోసం.. ఆంధ్రుల ప్రజా ప్రయోజనాల కోసమే అమరావతికి భూములు ఇచ్చామని రైతులు, మహిళలు, దళిత జేఏసీ నేతలు తెలిపారు.

రాష్ట్రం కోసమే..భూములిచ్చాం
నెక్కల్లు దీక్షా శిబిరంలో ముస్లింల ప్రార్ధనలు

వ్యక్తి గత ప్రయోజనాల కోసం కాదు

360వ రోజు దీక్షల్లో రాజధాని రైతులు, మహిళలు 

ఉద్దండ్రాయునిపాలెం బాధితులపై అట్రాసిటీ కేసులు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, డిసెంబరు 11: రాష్ట్రం కోసం.. ఆంధ్రుల ప్రజా ప్రయోజనాల కోసమే అమరావతికి భూములు ఇచ్చామని రైతులు, మహిళలు, దళిత జేఏసీ నేతలు తెలిపారు. అమరావతి రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం శుక్రవారంతో 360వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదు కోట్ల మంది కోసం భూములిచ్చామే కాని అందులో వ్యక్తిగత ప్రయోజనాలు లేవన్నారు. వ్యక్తిగతమైతే ఎకరమో, రెండెకరాలో ఇచ్చి మిగిలిన భూములను ఉంచుకుని లబ్ధి పొంది ఉండేవారమన్నారు. ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసిన పాలకులు అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులో ఇంటింటికి అమరావతి కార్యక్రమాన్ని చేపట్టారు. వెంకటపాలెంలో రాజధాని దళిత జేఏసీ కన్వీనర్‌ గడ్డం మార్టిన్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అమరావతి ఉద్యమం ఈ నెల 17కి ఏడాది చేరుకుంటున్న సందర్భంగా 16న వెంకటపాలెంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి తుళ్లూరులోని అంబేద్కర్‌  విగ్రహం వరకు బైకు ర్యాలీ నిర్వహించాలని,  17న రాజధాని శంకుస్థాపన చేసిన ప్రదేశంలో 12 గంటలు నిరాహార దీక్ష చేయాలని తీర్మానించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని నెక్కల్లు శిబిరంలో శుక్రవారం ముస్లింలు  ప్రార్థనలు చేశారు. 


బాధితులపైనే కేసులా : సుంకర పద్మశ్రీ

 ఈ నెల 6న ఉద్దండ్రాయునిపాలెంలో రాజధాని రైతు శిబిరంపై జరి గిన ఘటనలో బాధితులమైన తమపైనే పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టారని రైతులు, మహిళలు వాపోయారు. దాడి చేసిన వారిపై చర్య లు తీసుకుంటామని, రైతు శిబిరాలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన తుళ్లూరు డీఎస్పీ జే శ్రీనివాసరావు అందుకు విరుద్ధంగా వ్యవహరించా రన్నారు. దాడికి పాల్పడిన వారిపై సాధారణ కేసులు నమోదు చేశారన్నారు. పోలీసుల తీరును మహిళా జేఏసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ తప్పుపట్టారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ కులదూషణ చట్టాన్ని బాగా వాడుకుంటున్నాడని తెలిపారు. 


రాష్ట్రంలో దుర్మార్గపు పాలన :  మాజీ మంత్రి దేవినేని 

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఉద్దండ్రాయునిపాలెం దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన రాళ్ల దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు, దళితులు, మహిళలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలేసి అమరావతి ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసుల చేత రైతులు, మహిళలపై కేసులు నమోదు చేయిస్తున్నారన్నారు. 


- మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాకలో రాజ ధాని దీక్షలు శుక్రవారంతో 360వరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధే ఆంధ్రుల అభివృద్ధి అని, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించాలని, అప్పటి వర కు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు.  తాడికొండ మండలం పొన్నె కల్లు, మోతడక గ్రామంలో రైతులు, మహిళలు, సీపీఐ నాయకులు నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు ము ప్పాళ్ల శివశంకరావు మాట్లాడుతూ జగన్‌ అమరావతి ప్రాంతాన్ని ఏడారి గా, శ్మశానంగా చేయాలని చూస్తున్నారన్నారు.  


Updated Date - 2020-12-12T05:18:03+05:30 IST