రగిలిన.. రాజధాని
ABN , First Publish Date - 2020-12-08T05:27:21+05:30 IST
రాజధాని గ్రామమైన ఉద్దండ్రాయునిపాలెంలో రైతుల శిబిరంపై ఆదివారం జరిగిన దాడిని ఖండిస్తూ తుళ్లూరులో సోమ వారం నిరసనలు హోరెత్తాయి.

ఉద్దండ్రాయునిపాలెం ఘటనపై పెల్లుబికిన నిరసనలు
తుళ్లూరులో రోడ్డుపైనే రైతులు, మహిళలు జాగారం
నడిరోడ్డుపైనే దాదాపు 20 గంటలకు పైగా ఆందోళన
రాజధాని గ్రామాల్లో హోరెత్తిన అమరావతి నినాదాలు
రాజధాని రగిలింది. ఇంతకాలం ప్రశాంతం గా గాంధేయ మార్గంలో నిరసనలు చేస్తోన్న రాజధాని రైతులు, మహిళలు.. మహోగ్రంగా మారారు. ఆదివారం ఉద్దండ్రాయునిపాలెం లో రైతుల శిబిరంపై జరిగిన దాడితో అమరావతి పరిధిలోని గ్రామాల్లో నిరసనలు మిన్నంటాయి. తుళ్లూరు శిబిరం వద్ద ఆదివారం రాత్రి ప్రారంభించిన ఆందోళనలు సోమవారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఆదివారం రాత్రి చలిని సైతం లెక్క చేయకుండా రైతులు, మహిళలు జాగారం చేశారు. సోమవారం మధ్యాహ్నం ఎండ మండుతున్నా.. సాయంత్రం వరకు రోడ్డుపైనే నిరసన కొనసాగించారు. నడిరోడ్డుపైనే సుమారు 20 గంటలకు పైగా ఆందో ళన కొనసాగింది. వీరికి మద్దతుగా వివిధ పక్షాల నేతలతో పాటు.. వివిధ గ్రామా ల నుంచి రైతు లు, మహిళలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు.
తుళ్లూరు, డిసెంబరు 7: రాజధాని గ్రామమైన ఉద్దండ్రాయునిపాలెంలో రైతుల శిబిరంపై ఆదివారం జరిగిన దాడిని ఖండిస్తూ తుళ్లూరులో సోమ వారం నిరసనలు హోరెత్తాయి. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం సాయంత్రం వరకు రైతులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చలి, మండుటెండను లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ మహిళలు నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ మహిళా జేఏసీ నేతలు తుళ్లూ రు డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. నడిరోడ్డుపై దాదాపు 20 గంటలకు పైగా జరిగిన ఆందోళనలతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించాల్సి వచ్చింది. దాడికి నిరసనగా ఆందోళనలు చేయటానికి తుళ్లూరుకు రాజధాని 29 గ్రామాల రైతులు తరలివచ్చేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. తుళ్లూరులోకి వచ్చేందుకు అనుమతి లేదంటూ వెనక్కి పంపారు. అయినా కొందరు రైతులు వివిధ మార్గాల్లో తుళ్లూరు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. మూడు రాజధానుల శిబిరం ఎత్తివేయాలని డిమాండు చేశారు. ఇక నుంచి రైతులపై ఎటువంటి దాడులు జరగవని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో రోడ్డుపై నుంచి సాయంత్రం 4 గంటలకు ఆందోళనకారులు శిబిరంలోకి మారారు.
హింసాయుతంగా మార్చడానికే కుట్ర
గాంధేయ మార్గంలో రాజధాని రైతులు ఉద్యమం చేస్తుంటే, దానిని హింసాయుతంగా మార్చడానికి అధికార పార్టీ నాయకులు కుట్రలు చేశారని పలువురు ఆరోపించారు. టీడీపీ, సీపీఐ, రైతు జేఏసీ నేతలు పలువురు సోమవారం తుళ్లూరు శిబిరాన్ని సందర్శించి ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ రాజధాని రైతుల ఆందోళనలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. అధికారం ఉన్నప్పుడు ఒక లాగా, లేక పోతే మరొకలా ఉండకూడదనే విషయం వైసీపీ నాయకులు గ్రహించుకోవాలన్నారు. మూడు రాజధానుల శిబిరంలో సంఘవిద్రోహ శక్తులను ఉంచుతున్నారని ఆరోపించా రు. మూడు రాజధానుల కోరిక ఉన్న వారు విశాఖ, కర్నూలులో దీక్షలు చేసుకోవచ్చన్నా రు. అమరావతిలో అధికార పార్టీ కిరాయి మనుషులను పెట్టి శిబిరాన్ని ఏర్పాటు చేయ డం సిగ్గు చేటన్నారు. రైతుల ఉద్యమాన్ని అణచి వేసే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అమరావతికి వ్యతిరేకం కాద ంటూనే మూడు రాజధానులతో విషం చిమ్మారని విమర్శించారు. టీడీపీ గుంటూరు పార్లమెంటు అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కృష్ణా జడ్పీ మాజీ చైర్మన్ గద్దె అనురాధ, రైతు జేఏసీ సభ్యులు రావిపాటి సాయికృష్ణ, రాయపాటి శైలజ, సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లా డుతూ కుట్రలో భాగంగానే ఉద్దండ్రాయునిపాలెంలోని రైతుల శిబిరంపై దాడి జరిగిందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకోలేక పోలీసులు వారికే మద్దతుగా ఉన్నారన్నారు. శిబిరంపై దాడికి పాల్పడిన కిరాయి మూకలను అరెస్టు చేయాలని, మూడు రాజధానుల శిబిరాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
కొనసాగుతున్న దీక్షలు
రాజధాని అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు చేస్తున్న ఉద్యమం సోమవారంతో 356వ రోజుకు చేరుకుంది. రాజధాని పరిధిలోని పెదపరిమి, అనంతవరం నెక్కల్లు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, దొండపాడు, ఐనవోలు, నేలపాడు, వెలగపూడి, మందడం, యర్రబాలెం, పెనుమాక, బేతపూడి తదితర గ్రామాలలో ఆందోళనలు కొనసాగాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాల్లో రైతులు చేపట్టిన రిలే దీక్షలు 356వ రోజుకు చేరాయి. తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు, చిన్నారులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిం చారు. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మాట్లాడుతూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. మూడు రాజధానులకు అనుకూలమని దొంగ దీక్షలు చేసేవారికి మద్దతు తెలియజేయడం సిగ్గుచేటన్నారు.
