న్యాయదేవతే.. మాకు రక్ష

ABN , First Publish Date - 2020-11-22T04:58:30+05:30 IST

ఈ రాక్షసపాలన నుంచి న్యాయదేవతే తమ ను కాపాడుతుందని రాజధాని రైతులు పేర్కొన్నారు.

న్యాయదేవతే.. మాకు రక్ష
ఐనవోలులో జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్న రైతులు, మహిళలు

రైతు దీక్ష శిబిరాల్లో  పాలాభిషేకం

340వ రోజు కొనసాగిన రైతుల దీక్షలు 


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి, నవంబరు 21: ఈ రాక్షసపాలన నుంచి న్యాయదేవతే తమ ను కాపాడుతుందని రాజధాని రైతులు పేర్కొన్నారు. అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేప ట్టిన దీక్షలు శనివారం 340 రోజుకు చేరుకున్నాయి. పెదపరిమి, తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, అనంతవరం, ఐనవోలు, అబ్బరాజుపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, నేలపాడు, బోరుపాలెం తదితర రైతు శిబిరాల్లో దీక్షలు, ధర్నాలు కొనసాగించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ అమరావతి రైతులను ఈ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ప్రభుత్వాలు మారితే రాజధాని మారు తుందా అని ప్రశ్నించారు. అనంతవరంలో రైతులు, మహిళలు స్కిట్‌ ప్రదర్శించారు. రాజధాని రైతులపై జరుగుతున్న అకృ త్యాలు, అందుకు ఉన్నత న్యాయ స్థానాల స్పందన గురించి ఇందులో చూపించారు. దీక్షా శిబిరాల్లో న్యాయదేవత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిం చాలని కోరుతూ మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం, యర్రబాలెం, నవులూ రు, బేత పూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతులు రిలే నిరాహార దీక్షలు చేప ట్టారు. పలువురు రైతు సంఘ నేతలు సందర్శించి మద్దతు తెలి పారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో  రైతు ల నిరసన దీక్షలు కొనసా గాయి. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని నినాదాలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. రైతులపై బనాయించిన పలు కేసు లను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2020-11-22T04:58:30+05:30 IST