తుపాను బాధిత రైతులకు రూ.122.92 కోట్లు

ABN , First Publish Date - 2020-12-30T05:36:32+05:30 IST

జిల్లాలో నివర్‌ తుపాన్‌ వలన పంటలు నష్టపోయిన 1,45,230 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా రూ.122.92 కోట్లని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు.

తుపాను బాధిత రైతులకు రూ.122.92 కోట్లు

గుంటూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నివర్‌ తుపాన్‌ వలన పంటలు నష్టపోయిన 1,45,230 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా రూ.122.92 కోట్లని వారి బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌ రైతుభరోస - పీఎం కిసాన్‌ మూడో విడత చెల్లింపు, నివర్‌ తుపాను నష్టపరిహారం విడుదల కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ రైతుభరోసా కింద మూడో విడత సాయంగా 4,77,830 మంది రైతులకు రూ.99.382 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన దుగ్గిరాల మండల తుమ్మపూడి గ్రామానికి చెందిన మహిళ రైతు నాగమణి సీఎం జగన్‌తో సంభాషించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి, ఉద్యానవన శాఖ డీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-30T05:36:32+05:30 IST