సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2020-12-30T05:34:04+05:30 IST

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేక రైళ్లని గుంటూరు మీదగా నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

గుంటూరు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేక రైళ్లని గుంటూరు మీదగా నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. నెంబరు. నరసాపూర్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక పండగ రైలు(07441) జనవరి 11, 12, 15, 16 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు నరసపూర్‌కి చేరుకొంటుంది.  సికింద్రాబాద్‌ - నరసపూర్‌ ప్రత్యేక పండగ రైలు(07440) జనవరి 10, 11, 14, 15 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 5.40 గంటలకు నరసాపూర్‌ చేరుకొంటుంది. ఈ రెండు రైళ్లకు మార్గమధ్యలో నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, బీమవరం టౌన్‌, బీమవరం జంక్షన్‌, పాలకొల్లులో నిలుపుదల సౌకర్యం కల్పించారు. నెంబరు.  సికింద్రాబాద్‌ - కాకినాడ టౌన్‌  ప్రత్యేక రైలు(07436) జనవరి 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకొంటుంది. నెంబరు.  కాకినాడ టౌన్‌ - సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు(07437) జనవరి 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో రాత్రి 10.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకొంటుంది. ఈ రైళ్లకు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోటలో నిలుపుదల సౌకర్యం కల్పించారు. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌, త్రీటైర్‌, స్లీపర్‌క్లాస్‌, సెకండ్‌ సిట్టింగ్‌ కోచ్‌లు ఉంటాయని సీపీఆర్‌వో తెలిపారు. పరిమిత సంఖ్యలో నడుపుతున్న నారాయణాద్రి, నరసాపూర్‌, శబరి, అమరావతి ఎక్స్‌ప్రెస్‌లను మార్చి 31వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-30T05:34:04+05:30 IST