ప్రధాన విద్యాసంస్థల్లో క్వారంటైన్‌ కేంద్రాలు

ABN , First Publish Date - 2020-03-23T08:15:21+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని...

ప్రధాన విద్యాసంస్థల్లో క్వారంటైన్‌ కేంద్రాలు

  • యుద్ధప్రాతిపదికన 600 ఐసోలేషన్‌ గదులు సిద్ధం
  • ఉన్నతస్థాయి సమావేశంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

గుంటూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలోని ప్రముఖ విద్యాసంస్థల్లో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి సౌత్‌ కోస్టు ఐజీ ప్రభాకరరావు, అర్బన్‌ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ, రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయరావు హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించాం. హోం ఐసోలేషన్‌లో ఉండటానికి అనువైన వసతులు ఉన్నవారిని ఏ కేటగిరీలో, ఇళ్లల్లో ప్రత్యేక వసతులు లేని వారిని బీ కేటగిరీలో, అధికా రుల ఆదేశాలను ఉల్లంఘించి బయట సంచరిస్తున్న వారిని సీ-కేటగిరీలో చేర్చామన్నారు. ఈ నేపథ్యంలో బీ, సీ కేటగిరీల్లో ఉన్నవారందరిని క్వారంటైన్‌ కేం ద్రాలకు తరలించి ఐసోలేషన్‌లో ఉంచేందుకు నిర్ణయం తీసుకు న్నట్లు తెలిపారు. 

జిల్లాలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ, విజ్ఞాన్‌, సెయింట్‌ మేరీస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల తో పాటు వైద్య ఆరోగ్యశాఖ రీజనల్‌ శిక్షణ కేంద్రాల్లో 600 గదులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ కేంద్రానికి జిల్లా అధికా రిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమి స్తామని, క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చి పర్య వేక్షించాలన్నారు. వాటి వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు జిల్లాలో నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలు, ఆస్పత్రులు, మెడిక ల్‌షాపులు మినహామిగతావి మూసి వేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశామన్నారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకొంటారని చెప్పారు. నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయించకుండా దుకాణాలు ఆకస్మికంగా తనిఖీ చేస్తామని, మాస్కులు, శానిటైజర్లు నిర్దేశించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిం చారు. షాపింగ్‌ మాల్స్‌లో కూడా నిత్యావసర సరుకులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకొంటా మన్నారు. 

నేడు మాక్‌డ్రిల్‌

కరోన వైరస్‌ వ్యాప్తి కట్టడిలో భాగంగా క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ ప్లాన్‌ అమలుకు జిల్లాకేంద్రంలో సోమవారం మాక్‌డ్రిల్‌         నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఇందుకోసం జిల్లా అధికారులు అన్నిఏర్పాట్లు సిద్ధంచేయాలన్నారు.పట్టాభిపురం పరిధిలోని ప్రజలందరికి మాక్‌డ్రిల్‌ నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. 

నేటి నుంచి 144 సెక్షన్‌ అమలు

రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ దృష్ట్యా జిల్లా అంతటా 144 సెక్షన్‌ అమలులోకి తీసుకొస్తూ కలెక్టర్‌, మేజిస్టే్ట్రట్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీని దృష్ట్యా ప్రజలు నలుగురు మించి ఒక ప్రదేశంలో చేరి గూమి కూడదని చెప్పారు. ఈ నిబంధనలు తూచ తప్పకుండా పాటించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. 

ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి సత్య నారాయణ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌, జడ్పీ సీఈవో ఛైతన్య, డీపీవో రాంబాబు, నగరపాలకసంస్థ కమిషనర్‌ చల్లా అనురాధ, మునిసిపల్‌ ఆర్డీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-23T08:15:21+05:30 IST