ఎయిమ్స్‌లో క్వారంటైన్ సెంటర్
ABN , First Publish Date - 2020-03-27T09:18:16+05:30 IST
కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంగళగిరి ఎయిమ్స్‌వర్గాలు తెలిపాయి.
మంగళగిరి టౌన్, మార్చి 26 : కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు మంగళగిరి ఎయిమ్స్‌వర్గాలు తెలిపాయి. ఓపీడీ భవనం కింది అంతస్తులో జ్వరం, శ్వాసకోశ లక్షణాలతో బాధపడే వారికి స్ర్కీనింగ్ చేస్తున్నామన్నాని పేర్కొన్నాయి. ఇప్పటివరకు 30 మంది రోగులకు స్ర్కీనింగ్ నిర్వహించగా... పలువుర్ని హోమ్ ఐసోలేషన్‌కు సిఫారసు చేసి, తదుపరి పరీక్షల కోసం గుంటూరు డీఎంహెచ్‌వోకు రిఫర్ చేసినట్టు తెలిపాయి. కోవిడ్‌పై ఎయిమ్స్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు తరచు మాక్‌డ్రిల్ నిర్వహిస్తూ రోగుల వివరాలను, రికార్డులను నిర్వహిస్తున్నట్టు ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. అనుమానిత రోగుల కోసం జిల్లా అధికారులతో సంప్రదించి ఎయిమ్స్ ఆసుపత్రిలో 60 పడకలతో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటుచేశామని తెలిపాయి. ఒకవేళ రోగుల ఆరోగ్యం క్షీణించినట్టయితే ఐసోలేషన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నాయి.