స్తంభించిన రవాణా వ్యవస్థ

ABN , First Publish Date - 2020-03-23T08:39:58+05:30 IST

రీజియన్‌లో దాదాపు 1100 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించింది. గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌తో పాటు...

స్తంభించిన రవాణా వ్యవస్థ

గుంటూరు, మార్చి 22: రీజియన్‌లో దాదాపు 1100 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ  స్తంభించింది. గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌తో పాటు తెనాలి, నరసరావుపేట, చిలకలూరిపేటతోపాటు ఇతర డిపోలు ప్రయాణికుల్లేక వెలవెలబోయాయి. ఆర్టీసీతో పాటు ప్రైవేటు బస్సులు, ట్రక్కుల రవాణా నిలిచిపోవటంతో ప్రధాన రహదారులు వెలవెలబోయాయి. ఒక్క రోజులోనే ఆర్టీసీకి రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఖజానాకు నష్టం కలిగింది.     ప్రైవేటు ట్రావెల్స్‌, ట్రక్కులు, క్యాబ్‌లు, ఇతర రవాణా వాహనాలనూ ఈ నెల 31వరకు నిలిపివేయనున్నారు.


అయితే నిత్యావసర సరుకులు తరలించే వాహనాలను అనుమతించనున్నారు. జనతా కర్ఫ్యూలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 బంకులు ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మూత పడ్డాయి.   అత్యవసర సేవలైన అంబులెన్స్‌, పోలీసు, ఇతర వాహనాలకు బంకుల్లోకి అనుమతించారు. డిజిటల్‌ పేమెంట్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పెట్రోల్‌ ట్రేడర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు.

Updated Date - 2020-03-23T08:39:58+05:30 IST