దేవాలయాల పునః ప్రారంభానికి సన్నాహాలు

ABN , First Publish Date - 2020-05-13T09:36:32+05:30 IST

జిల్లాలో ప్రముఖ ఆలయాలను తిరిగి పునః ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

దేవాలయాల పునః ప్రారంభానికి సన్నాహాలు

దేవాలయాల్లో మార్కింగ్‌కు సన్నాహాలు భౌతిక దూరంతోనే దర్శనాలు


పెదకాకాని, మే 12: జిల్లాలో ప్రముఖ ఆలయాలను తిరిగి పునః ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలైన పెదకాకాని, మంగళగిరి, అమరావతి, కోటప్పకొండ, తెనాలి వైకుంఠపురం, గుంటూరు లాలాపేట గ్రూపు దేవాలయాలను పునః ప్రాంభానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవోలు, మేనేజర్లు చర్యలు తీసుకుంటున్నారు. యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా దేవాలయానికి వచ్చే ప్రతి భక్తునికి హ్యాండ్‌ శానిటైజర్లు, రాజగోపుర ప్రధాన ప్రవేశమార్గం వద్ద హ్యాండ్‌ ధర్మల్‌స్రీన్‌ చేసి ఆలయంలోకి అనుమతిస్తారు. ప్రతి భక్తుడు భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లు, హుండీల వద్ద సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రపర్చటం, శానిటైజర్‌ను విధిగా విధిగా వినియోగించటం అన్ని రకాల సూచలపై మైకుల్లో భక్తులను అప్రమత్తం చేయనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం గుంపులుగా ఉండకుండా చర్యలు తీసుకోకున్నారు. ఈ నెల 17 తర్వాత లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించిన అనంతరం దర్శనాలు చేయించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Read more