నేడు ప్రగడ కోటయ్య 25వ వర్ధంతి

ABN , First Publish Date - 2020-11-26T04:20:18+05:30 IST

చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య 25వ వర్ధంతి గురువారం జరగనుంది.

నేడు ప్రగడ కోటయ్య 25వ వర్ధంతి
ప్రగడ కోటయ్య (ఫైల్‌)

పొన్నూరు, నవంబరు 25: చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య 25వ వర్ధంతి గురువారం జరగనుంది. చేనేతరంగ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే తన ఊపిరిగా తుదిశ్వాస వరకు కృషిచేసిన కోటయ్య 1915 జూలై 26న జన్మించారు. చేనేత సహకార సంఘాల ఏర్పాటులోనూ ఆయన సేవలు నిరుపమానం. రాజకీయాలు, చేనేత రంగానికి అంకితమైన ప్రగడ కోటయ్య చేనేత పరిశ్రమ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడిగా చేనేత పరిశ్రమ పరిరక్షణ, కార్మికుల సంక్షేమానికి చివరిక్షణం వరకు కృషిచేసిన ప్రగడ కోటయ్య 1995 నవంబర్‌ 26న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో దేశంలో చేనేత పరిశ్రమ, కార్మికులు పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది.

Read more