నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2020-09-12T10:07:57+05:30 IST
నగర పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో నిర్వహణ, అవసరమైన మరమ్మతులలో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా

గుంటూరు, సెప్టెంబరు 11: నగర పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో నిర్వహణ, అవసరమైన మరమ్మతులలో భాగంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు గుంటూరు టౌన్-1 డీఈ జె.హరిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీనివాసరావుతోట, కేవీపీ కాలనీ, కొత్తకాలనీ, కోదండరామయ్యనగర్, కేబీ కాలనీ, ఎస్‌జీ కాలనీ, లాలుపురం, లింగాయపాలెం, అంకిరెడ్డిపాలెం, ఏటుకూరు, బొంతపాడు, నల్లచెరువు, సింహపురి ఎస్టేట్, గంగమ్మఎస్టేట్, బీజేటీ లైన్, శివరామ్‌నగర్, జీటీ రోడ్డు, రామనామక్షేత్రం, ఐటీసీ రోడ్డు, నల్లపాడు, వెంగళాయపాలెం, నల్లపాడు ఇండస్ట్రీయల్ ఏరియా, ఏపీహెచ్‌బీ కాలనీ, ఎన్‌జీవో కాలనీ, వీఆర్ కాలనీ, సీతమ్మకాలనీ, సీతారామ్ టౌన్‌షిప్ ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. బాలాజీనగర్, నందివెలుగురోడ్డు, మారుతీనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, గొలుసుకొండలరావునగర్, ముగ్దుమ్‌నగర్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, యాదవబజారు, పాతగుంటూరు, పార్క్ సెంటర్ ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.