పొట్టి శ్రీరాములకు ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-16T04:44:59+05:30 IST

తెలుగువారందరినీ ఐక్యం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు.

పొట్టి శ్రీరాములకు ఘన నివాళి
పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యేలు గిరిధర్‌, ముస్తఫా, ఛైర్మన్‌ ఏసురత్నం తదిదతరులు

గుంటూరు, డిసెంబరు 15: తెలుగువారందరినీ ఐక్యం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ  ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర అన్నారు. లక్ష్మీపురంలోని తన కార్యాలయంలో మంగళవారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

- హిందూకళాశాల సెంటర్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యేలు గిరిధర్‌,  ఎండీ ముస్తఫా, మార్కెట్‌యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నంలు పూలమాలలతో నివాళులర్పించారు.  మద్యవిమోచన ప్రచార కమిటీ చైౖర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు షౌకత్‌, టీఎల్‌వీ వీరాంజనే యులు తదితరులు పాల్గొన్నారు.

 - ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ అల్తాఫ్‌ ఆధ్వర్యంలో కొత్తపేటలోని కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. 

- అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. 

 - స్థానిక చౌడవరంలోని ఆర్వీఆర్‌జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో మంగళవారం సర్ధార్‌ వల్లభాయ్‌పటేల్‌  వర్ధంతి నిర్వహించారు. దేశ సమగ్రతకు, సమైక్యతకు  పటేల్‌ ఎంతో కృషిచేశారని కళాశాల కార్యదర్శి రాయపాటి గోపాలకృష్ణ  తెలిపారు. ఆయన స్ఫూర్తిని నేటి తరం విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు.  ఉప ప్రధాన మంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఆయన ఎనలేని సేవలు అందించారని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి సుధాకర్‌ తెలిపారు. పటేల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి  నివాళులర్పించారు.

 - పోలీస్‌ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అర్బన్‌ ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ మనోహరరావు, అధికారులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా శ్రీరాములు రాష్ట్రం కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తితో పోలీసులు పనిచేయాలన్నారు.  కార్యక్రమంలో ఆర్‌ఐ ధామస్‌రెడ్డి, ఏవో వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2020-12-16T04:44:59+05:30 IST