-
-
Home » Andhra Pradesh » Guntur » polytechnic
-
పాలిటెక్నిక్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు
ABN , First Publish Date - 2020-12-06T05:53:22+05:30 IST
స్థానిక నల్లపాడులోని ప్రభుత్వ జౌళి సాంకేతిక కళాశాలలో(టెక్స్‌టైల్) ఈనెల 10న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణబాబు ఓ ప్రకనటలో పేర్కొన్నారు.

గుంటూరు(విద్య), డిసెంబరు 5: స్థానిక నల్లపాడులోని ప్రభుత్వ జౌళి సాంకేతిక కళాశాలలో(టెక్స్‌టైల్) ఈనెల 10న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కేవీ రమణబాబు ఓ ప్రకనటలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 5వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. స్పాట్ అడ్మిషన్ల కోసం 9848372886 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
మైనార్టీ పాలిటెక్నిక్ కళాశాలలో....
స్థానిక నల్లపాడులోని మైనార్టీ ప్రభుత్వ కళాశాలలో ఈనెల 10వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కోఆర్డినేటర్ ఎ.రామిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలిసెట్ రాసి క్వాలిఫై అయిన వారు, కాని వారు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఇతర వివరాల కోసం 8074604926, 9490343929 నెంబర్స్‌లో సంప్రదించాలని సూచించారు.