టీడీపీ నేతలకు పోలీసుల బెదిరింపులు

ABN , First Publish Date - 2020-03-12T07:10:43+05:30 IST

కారంపూడి మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల సందర్భంగా మంగళవారం రాత్రి నుంచే పోలీసులు టీడీపీ నేతలందరికీ ఫోన్లు చేసి నామినేషన్లు

టీడీపీ నేతలకు పోలీసుల బెదిరింపులు

కారంపూడి, మార్చి 11: కారంపూడి మండల ప్రజా పరిషత్‌ ఎన్నికల సందర్భంగా మంగళవారం రాత్రి నుంచే పోలీసులు టీడీపీ నేతలందరికీ ఫోన్లు చేసి నామినేషన్లు వేయవద్దని, వేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  15 ఎంపీటీసీల పరిధిలో కేవలం 5 ఎంపీటీసీ స్థానాలకే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అది కూడా చివరి నిమిషంలో గప్‌చుప్‌గా వేసి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.  మండల పరిషత్‌ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచె వేసి ఒక వైపు నుంచి పంపిస్తూ వారి ఫారాలను పోలీసులకు చూపి ఏ పార్టీనో చెప్పి, సెల్‌ నంబరు ఇస్తేనే ఆ కొద్ది మందిని కూడా లోపలకు ప్రవేశించేలా చేశారు. 

Updated Date - 2020-03-12T07:10:43+05:30 IST