కోడి పందేల స్థావరంపై దాడి

ABN , First Publish Date - 2020-12-02T05:11:15+05:30 IST

తీరంలో కోడి పందేలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. మండలంలోని చెన్నుపల్లివారిపాలెం సమీపంలో పందేల స్థావరంపై మంగళవారం స్పెషల్‌ బ్రాంచి పోలీసులు దాడులు నిర్వహించి 10 మంది కోడిపందెం కాసేవారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.

కోడి పందేల స్థావరంపై దాడి
చెన్నుపల్లివారిపాలెం సమీపంలో కోడిపందెం రాయుళ్ళను అదుపులోకి తీసుకున్న పోలీస్‌లు

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

10 మంది పందెం రాయుళ్ళు అరెస్ట్‌..  రూ.11,150 స్వాధీనం

రేపల్లె, డిసెంబరు 1: తీరంలో కోడి పందేలపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనానికి పోలీసులు స్పందించారు. మండలంలోని చెన్నుపల్లివారిపాలెం సమీపంలో పందేల స్థావరంపై మంగళవారం స్పెషల్‌ బ్రాంచి పోలీసులు దాడులు నిర్వహించి 10 మంది కోడిపందెం కాసేవారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 4 కోళ్లు, రూ.11,150 స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. మండలంలో ఎక్కడైనా కోడిపందాలు నిర్వహిస్తే చట్టపరమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-12-02T05:11:15+05:30 IST