ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ABN , First Publish Date - 2020-03-21T10:02:24+05:30 IST

ఆరు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు ఇసుక రీచ్‌లో గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. సీఐ శరత్‌బాబు ఆధ్వర్యంలో అబ్బరాజుపాలెం రీచ్‌లో

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

  • రెండు రోజుల క్రితం మరో రెండు స్వాధీనం 

తుళ్లూరు, మార్చి 19 : ఆరు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు ఇసుక రీచ్‌లో గురువారం తెల్లవారుజామున పట్టుకున్నారు. సీఐ శరత్‌బాబు ఆధ్వర్యంలో అబ్బరాజుపాలెం రీచ్‌లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నారు. రెండు రోజుల క్రితం  రాజధాని రోడ్ల కింద ఉన్న ఇసుకను తవ్వుతున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. వాహనాలను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు సీఐ  శరత్‌బాబు తెలిపారు. కాగా, తుళ్లూరు మండలంలో ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇసుక కొరత కారణంగా  ఇంటి నిర్మాణాలు పూర్తి కాకుండా ఆగిపోయాయి. దీంతో రాజధాని రోడ్ల నిర్మాణాల వద్ద ఉన్న ఇసుకను తవ్వేస్తూ అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. రాత్రిళ్లు మనుషులతో ట్రాక్టర్లకు లోడు చేసి తీసుకెళుతున్నారు. అయితే అబ్బరాజుపాలెంలో సీఐ శరత్‌బాబు పట్టుకున్న వాహనాలు గ్రామాలలో రోడ్ల నిర్మాణం కోసం ఇసుకను తీసుకెళుతున్నట్టు ట్రాక్టర్ల డ్రైవర్లు చెపుతున్నారు. అందుకు పర్మిషన్‌ తీసుకున్నామని  వైసీపీ నాయకులు చెప్పారని ట్రాక్టర్ల యజమానులు పేర్కొంటున్నారు.  పోలీసులు పట్టుకునే సరికి మాట కూడా చెప్పటం లేదని ట్రాక్టర్ల యజమానులు వాపోతున్నారు. అనుమతి లేని రీచ్‌ ల నుంచి ఇసుకను తరలించటం అక్రమ రవాణానేనని సీఐ పేర్కొన్నారు. అందుకే వాహనాలను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించామని సీఐ శరత్‌బాబు చెప్పారు. 

Updated Date - 2020-03-21T10:02:24+05:30 IST