ఇళ్ల స్థలాల భూసేకరణలో.. తవ్విన కొద్దీ అక్రమాలు

ABN , First Publish Date - 2020-12-31T05:28:52+05:30 IST

పేదలందరికీ ఇళ్లస్థలాల భూసేకరణలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

ఇళ్ల స్థలాల భూసేకరణలో..  తవ్విన కొద్దీ అక్రమాలు

నల్లమోతువారిపాలెంలో ఎకరాకు రూ.81.30 లక్షల చెల్లింపు 

మండల కేంద్రంలో  కేవలం రూ.30 లక్షలే...


పేదలందరికీ ఇళ్లస్థలాల భూసేకరణలో తవ్విన కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. భూసేకరణలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అధికార పార్టీనేతలు, వారి అనుచరులకు అయాచితంగా లబ్ధి చేకూర్చి పెట్టారనే విమర్శలు ఇస్తున్నాయి. ఎక్కడో మారుమూలన కర్లపాలెం మండలంలోని నల్లమోతువారిపాలెంలో ఎకరానికి రూ.81.30 లక్షలు చెల్లించారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.

 

గుంటూరు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్లపాలెం మం డలంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి 28.27 ఎకరాల భూమిని సేకరించారు. మండల కేంద్రంలో ఎకరాకు రూ.30 లక్షలు, ఇతర గ్రామాల్లో రూ.18 లక్షల నుంచి రూ.22 లక్షల వరకు చెల్లించారు. అయితే నల్లమోతువారిపాలెంలో మాత్రం ఎకరానికి రూ.81.30 లక్షలు చెల్లించారు. ఇక్కడ సేకరించిన ఎకరం 23సెంట్ల భూమికి ఇంచు మించుగా రూ.కోటి చెల్లించారు. అంత పెద్దమొత్తంలో ఎందుకు చెల్లించారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ గ్రామంలో ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వడానికి ముందుకు రాకపోతే సమీపంలోని గ్రామంలో భూమిని సేకరించి ఇళ్ల పట్టాలు ఇవ్వొ చ్చు. గుంటూరు నగరంలోని లబ్ధిదారులకు అలానే చేశారు. ఇక్కడి లబ్ధిదారులకు పేరే చర్ల, మేడికొండూరు, లాం, జొన్నలగడ్డ, దామరపల్లి, ఏటుకూరు, కొర్నెపాడులో భూములు సేకరించి ఇస్తున్నారు. ఇలాకాకుండా నల్లమోతువారిపాలెంలోనే ఎక్కువ ధరపెట్టి కొనుగోలు చేయడం వెనక ఉన్న మతలబు ఏమిటన్న ప్రశ్నలు తలె త్తుతున్నాయి. అంత ధర గుంటూరు నగరానికి సమీపంలో కూడా లేదు. తెనాలి రెవె న్యూ డివిజన్‌ పరిధిలో అందినకాడికి దండుకొన్నారనేది బహిరంగ రహస్యమే. అ యినా వారిపై ఎలాంటి విచారణలు చేపట్టే పరిస్థితి లేదు. దీంతో భూసేకరణలో వెన కేసుకొన్న అక్రమ సంపాదనతో ఓ అధికారి తన కుటుంబం సహా విదేశాలకు వెళ్లి జల్సా చేశారన్న చర్చ రెవెన్యూవర్గాల్లో జరుగుతోంది. 

Updated Date - 2020-12-31T05:28:52+05:30 IST