రూ.30 లక్షలతో ఉడాయించిన పెట్రోలు బంకు మేనేజర్‌

ABN , First Publish Date - 2020-03-24T09:31:36+05:30 IST

బ్యాంకులో డీడీ తీస్తానంటూ వెళ్లిన పెట్రోలు బంకు మేనేజరు రూ.30 లక్షల నగదుతో ఉడాయించాడు. ఇందుకు సంబంధించి రెండవ పట్టణ...

రూ.30 లక్షలతో ఉడాయించిన పెట్రోలు బంకు మేనేజర్‌

నరసరావుపేట లీగల్‌, మార్చి 23: బ్యాంకులో డీడీ తీస్తానంటూ వెళ్లిన పెట్రోలు బంకు మేనేజరు రూ.30 లక్షల నగదుతో ఉడాయించాడు. ఇందుకు సంబంధించి రెండవ పట్టణ ఎస్‌ఐ రబ్బానీ ఖాన్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక వినుకొండ రోడ్డులోని జనసేన నేత జిలానీకి చెందిన ఫిల్లింగ్‌ స్టేషన్‌ ఉంది. అందులో మేనేజర్‌గా పని చేస్తున్న మండలంలోని ములకలూరుకు చెందిన షేక్‌ మౌలాలి బ్యాంక్‌లో డీడీ తీయాల్సిన నగదును వారం రోజుల నుంచి తన వద్దే ఉంచుకున్నాడు. సోమవారం సుమారు రూ.30 లక్షలు నగదును డీడీ కోసమని తీసుకువెళ్ళి ఉడాయించాడని ఫిర్యాదు వచ్చినట్టు ఎస్‌ఐ తెలిపారు. ప్రాథమిక ఆధారాల అనంతరం కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకుంటామని చెప్పారు.

Read more