-
-
Home » Andhra Pradesh » Guntur » pestisides
-
నకిలీ బయోల తయారీ గుట్టురట్టు
ABN , First Publish Date - 2020-12-20T05:08:20+05:30 IST
మండలంలోని జాతీయ రహదారి పక్కన నడింపాలెం పంచాయతీ పరిధిలో ఒక రేకుల షెడ్డులో నకిలీ బయో ఉత్పత్తుల తయారీ గుట్టును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు.

ప్రత్తిపాడు, డిసెంబరు 19: మండలంలోని జాతీయ రహదారి పక్కన నడింపాలెం పంచాయతీ పరిధిలో ఒక రేకుల షెడ్డులో నకిలీ బయో ఉత్పత్తుల తయారీ గుట్టును స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రట్టు చేశారు. శనివారం ప్రత్తిపాడు తహసీల్దార్ పూర్ణచంద్రరావు, ఏవో విజయరాజులు, డీడీఏ పి.రామాంజనేయులు, ఏడీఏ కేవీ శ్రీనివాసరావులు పరిశీలించారు. షెడ్డులో కాలంచెల్లిన బయో ఉత్పత్తులు, లేబుళ్లు, ఖాళీ బాటిళ్లు, మూతలు, రకరకాల పేర్లతో బిల్లు పుస్తకాలు, డ్రమ్ముల్లో లిక్విడ్ ఉన్నాయి. దుర్గికి చెందిన కపిలవాయి రమేష్ అనే వ్యక్తి ఈ షెడ్డును అద్దెకు తీసుకుని వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపుతామని, ఇందులో పురుగు మందుల అవశేషాలు ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక్కడ మొత్తం 14 రకాల కంపెనీల పేర్లతో ఉన్న 733 బాటిళ్లతో పాటు, ఆరు కంపెనీలకు చెందిన కాలం చెల్లిన బయో ఉత్పత్తులను సీజ్ చేశారు. ప్రత్తిపాడు ఎస్‌ఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.