-
-
Home » Andhra Pradesh » Guntur » pending power bills
-
పంచాయతీలకు షాక్.. విద్యుత్ బిల్లులు చెల్లించాలని నోటీసులు
ABN , First Publish Date - 2020-12-19T06:03:07+05:30 IST
పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు పేరుకు పోతున్నాయి. మైనర్ పంచాయతీల్లోనూ రూ.లక్షల్లో విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు ట్రాన్స్‌కోకు గుదిబండగా మారా యి.
పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు
జిల్లావ్యాప్తంగా రూ.70 కోట్లకుపైగా పెండింగ్
కరెంటు బిల్లుల వసూళ్లపై ట్రాన్స్‌కో అధికారుల దృష్టి
బకాయిలు చెల్లించకపోతే సరఫరా నిలిపివేతకు రంగం సిద్ధం
వీధి దీపాలు, తాగునీటి పథకాలు నిలిచిపోతే ఇబ్బందులే
15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరైనా చెల్లింపులపై నిర్లక్ష్యం
(ఆంధ్రజ్యోతి - న్యూస్ నెట్‌వర్క్): పంచాయతీలకు ట్రాన్స్‌కో షాక్ ఇచ్చింది. బకాయిలు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. అదే జరిగితే వీధి దీపాలు లేక అంధ కారం, తాగునీటి పథకాలు నిలిచి గ్రామస్థులు అవస్థలు పడే ప్రమాదం ఉంది. వీధి దీపాలు, తాగునీటి పథకాలకు సంబంధించిన కరెంటు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాల్సి ఉన్నా నిధుల లేమి.. నిర్లక్ష్యంతో వాటి గురించి పంచాయతీల అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో జిల్లాలో అన్ని పంచాయతీలకు కలిపి రూ.70 కోట్లకు పైనే బకాయిలు పేరుకు పోయినట్లు ట్రాన్స్‌కో అధి కారులు లెక్కతీశారు. రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌లో ఉన్న బకాయిల వసూళ్లపై ట్రాన్స్‌కో దృష్టి సారించి 15 రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. అయినా పంచాయతీల నుంచి కనీస స్పందన లేదు. దీంతో ఉన్నతాధికా రుల ఆదేశాల మేరకు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించని, ఎక్కువ మొత్తంలో బకాయిలు ఉన్న పంచా యతీల జాబితాలు రూపొం దించి కరెంటు సరఫరా నిలిపివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు.
పంచాయతీల్లో విద్యుత్ బిల్లులు పేరుకు పోతున్నాయి. మైనర్ పంచాయతీల్లోనూ రూ.లక్షల్లో విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిలు ట్రాన్స్‌కోకు గుదిబండగా మారా యి. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు కలిపి రూ.70 కోట్లకు పైనే బిల్లులు బకా యిలున్నట్లు గణాంకాలు తెలియ జేస్తున్నా యి. గుంటూరు రూరల్ మండలంలో రూ.2.30 కోట్లు కాగా పెదకాకాని మండల పరిధిలో పంచాయతీలు రూ.7.82 కోట్ల మేర బకాయి లున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బిల్లుల బకాయిలు పేరుకు పోయాయి. ప్రస్తు తం జిల్లాలో పలు మైనర్ పంచాయతీలు రూపాయి కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నా యి. ప్రభుత్వం అందించే సాయం కోసం ఆయా పంచాయతీలు ఎదురు చూస్తున్నాయి. ఇటీవల 15వ ఆర్థిక ప్రణాళికా సంఘం నిధులు పంచాయతీలకు మంజూరయ్యాయి. ఆయా నిధులతో బిల్లులు చెల్లిస్తారని ట్రాన్స్‌కో అధికారులు భావించారు. అయితే పంచాయ తీ అధి కారులు బిల్లుల చెల్లింపులపై దృష్టి సారించలేదు. దీంతో ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు కనీసం 40 శాతం కూడా బిల్లు లు చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
- సత్తెనపల్లి మండలంలోని రూ.73,82,627, రాజుపాలెం మండ లంలో రూ.1,02,08,623, నకరిక ల్లు మండలంలో రూ.1,10,00,000, ముప్పాళ్ల మండలంలో రూ.85,65,940 విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.
- తెనాలి నియోజకవర్గంలోని తెనాలి, కొల్లిపర మండలా ల్లో రూ.7.67 కోట్ల బకాయిలున్నా యి. ఇవికాక పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల బకాయిలు రెండు మండలాల్లో కలిపి రూ.78.11 లక్షల వరకు బకాయిలున్నాయి. తెనాలి మండలంలో 26, కొల్లిపర మండలంలో 12 పంచాయతీలు విద్యుత్ కనెక్షన్ కట్ చేసే జాబితాలో ఉన్నాయి.
- నరసరావుపేట మండలంలో సుమారు రూ.2 కోట్లు, రొంపిచర్ల మండలంలో రూ.56 లక్షలు బకాయిలు ఉన్నట్లు ట్రా న్స్‌కో ఏడీఈ కొండలు తెలిపారు.
- వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం, ఈపూరు, బొల్లాపల్లి, నూజెండ్ల, వినుకొండ మండలాల్లోని 105 పంచాయతీల్లో రూ.4కోట్ల 84 లక్షల 95 వేల బకాయిలు ఉన్నాయి.
- పొన్నూరు నియోజకవర్గంలోని పంచాయతీ ల విద్యుత్ బకాయిలు రూ. 19.80 కోట్లు ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ తరపునే రూ.7.60 కోట్లు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని సుమారు 44 పంచాయతీలకు కరెంట్ కట్ చేసేందుకు విద్యు త్ శాఖ సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చారు.
- చిలకలూరిపేట మండల పరిధిలోని పంచాయతీలు రూ.3,28,33,475, యడ్లపాడు మండల పరిధిలోని పంచాయతీలు రూ.2,82,36,180 ట్రాన్స్‌కోకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు.
- మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండ లాల్లోని 42 పంచాయతీల్లో నవంబరు నాటికి రూ.8,86,77,546 విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి.
- వేమూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లోని 88 గ్రామ పంచాయతీ లు రూ.17.43 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
- మాచర్ల నియోజకవర్గ పరిధిలోని 71 పంచాయతీలు రూ.32,74,02,926 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
- బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, చెరుకుపల్లి, పొన్నూరు, కాకుమాను, పెద నందిపాడు పరిధిలోని పంచాయతీల నుంచి ట్రాన్స్‌కోకు సుమారూ.7 కోట్ల 30 లక్షలు బకాయిలు ఉన్నాయి.
-పెదకూరపాడు మండ లంలో రూ.2.47 కోట్లు, అమరావతి మండలంలో రూ.2.25 కోట్లు, క్రోసూ రు మండలంలో రూ. 95.55 లక్షలు, బెల్లంకొండ మండలంలో రూ. 41.36 లక్షలు వి ద్యుత్ బకాయిలు చెల్లించా ల్సి ఉంది.
- ఫిరంగిపురం మండలంలో రూ. 2,60,87,836, తుళ్లూరు మం డలంలో రూ.2 కోట్ల 50 లక్షలు, తాడికొండ మండలంలో రూ.4, కోట్ల 47,లక్షలు బకాయిలు పేరుకుపోయాయి.
నోటీసులు జారీ చేశాం
బకాయిలు పేరుకుపోయిన పంచా యతీ కార్యాలయాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యా లయాలకు కూడా నోటీసులు అంద జేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనీసం 40 శాతం కూడా బిల్లులు చెల్లిం చని పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తాం. ఇప్పటికే ఇతర జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకున్నారు.
- విజయకుమార్, గుంటూరు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ