పేదలకు నివేశనస్థలాల పట్టాల పంపిణీ
ABN , First Publish Date - 2020-12-30T06:05:29+05:30 IST
మండలంలోని చిలువూరులో పేదలకు నివేశనస్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. చిలువూరుకు చెందిన 208మందికి పట్టాలు అందిజేశారు.

దుగ్గిరాల, డిసెంబరు 29: మండలంలోని చిలువూరులో పేదలకు నివేశనస్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. చిలువూరుకు చెందిన 208మందికి పట్టాలు అందిజేశారు. అనంతరం మొదటి విడత ఇళ్లనిర్మాణానికి ఎమ్మెల్యే ఆళ్ల, సబ్‌కలెక్టర్ మయూర్ అశోక్‌లు శంకుస్థాపన గావించారు. గృహనిర్మాణశాఖ జిల్లా పీడీ వేణుగోపాల్, యార్డుచైర్మన్ కొండూరు ముత్తయ్య, మాజీవైస్ ఎంపీపీ వి.రజనీకాంత్, దాసరి వీరయ్య, దానబోయిన వెంకటేశ్వరరావు, బోళ్ల శ్రీనివాసరెడ్డి, నడకుదురు సుబ్రహ్మణ్యం, ధనుంజయ, బాజి, యార్లగడ్డ చిన్నా, వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శి షేక్ సుభాని, ఇత్తడి చంటి, కుర్రా సీతారామయ్య, తహసీల్దార్ కె.మల్లీశ్వరి, ఎంపీడీఓ కుసుమశ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.