ప్రార్థనా మందిరాల వద్ద గస్తీ
ABN , First Publish Date - 2020-09-14T08:53:20+05:30 IST
అంతర్వేదితో పాటు రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆలయాల వద్ద లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు ..
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి..
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీజీపీ ఆదేశాలు
గుంటూరు, సెప్టెంబరు 13: అంతర్వేదితో పాటు రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని ఆలయాల వద్ద లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి అన్ని జిల్లాల ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
సీసీ కెమెరాలను జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలన్నారు. మందిరాల వద్ద రాత్రి పూట గస్తీ నిర్వహించాలన్నారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అర్బన్, రూరల్ ఎస్పీలు ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, విశాల్‌గున్నీ తదితరులు పాల్గొన్నారు. అర్బన్‌లో విజుబుల్ పోలీసింగ్‌తో ట్రాఫిక్‌తో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా, నేరాలు జరగకుండా కట్టడి చేశారని అర్బన్ ఎస్పీని డీజీపీ అభినందించారు.