పెండింగ్‌లో పాస్‌పుస్తకాలు.. గడువు దాటినా.. చేతికందక

ABN , First Publish Date - 2020-12-14T05:00:30+05:30 IST

వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుబుక్‌ అనేది గుండెకాయ లాంటి ది. ఎలాంటి సబ్‌ డివిజన్లు జరిగినా సంబంధిత భూ రికార్డుల్లో సవరణలు చేసి పట్టాదారు పాసుబుక్‌ చేతికం దితేనే భూములు కొనుగోలు చేసిన వారు ఽభరోసాగా ఉంటారు.

పెండింగ్‌లో పాస్‌పుస్తకాలు.. గడువు దాటినా.. చేతికందక

సుమారు నాలుగు వేల వరకు గడువు దాటాయి..

100 రోజులైనా అతీగతీ లేదు..

గడువు ముగిసిపోయిన దరఖాస్తులు 3,958  

పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ చెన్నైలో..

సర్వర్‌ బిజీ అంటున్న రెవెన్యూ వర్గాలు

పైసలిస్తేనే పనిచేస్తున్నారని రైతులు ఆరోపణ 


రెవెన్యూ సేవల్లో ఎన్ని సంస్కరణలు తీసు కొచ్చినా భూ యజమానులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా మ్యుటేషన్‌ అండ్‌ టైటిల్‌ డీడ్‌ - కమ్‌ - పట్టాదారు పాసుబుక్‌ పొందాలంటే నెలల తరబడి నిరీక్షిం చాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పట్టాదారు పాసు బుక్‌ ప్రింటింగ్‌ ఎక్కడో చెన్నైలో ఒక ఏజెన్సీ కి ఇవ్వడంతో సమస్యలు అలానే కొనసాగుతు న్నాయి. గడువు సమయం 45 రోజుల వరకు ఉండగా పట్టాదారు పాసుబుక్‌ చేతికి అందా లంటే  100 రోజులకు పైగా నిరీక్షించాల్సిందే...! అది కూడా రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకొంటూ నిత్యం ప్రదక్షిణలు, సిఫార్సులు చేయిస్తేనే అంతంతమాత్రంగా పని అవు తోందని రైతులు వాపోతున్నారు.  


గుంటూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూమికి పట్టాదారు పాసుబుక్‌ అనేది గుండెకాయ లాంటిది. ఎలాంటి సబ్‌ డివిజన్లు జరిగినా సంబంధిత భూ రికార్డుల్లో సవరణలు చేసి పట్టాదారు పాసుబుక్‌ చేతికం దితేనే భూములు కొనుగోలు చేసిన వారు ఽభరోసాగా ఉంటారు. జిల్లాలో ఇటీవల మ్యుటేషన్‌ అండ్‌ టైటిల్‌ డీడ్‌ - కమ్‌ - పట్టాదారు పాసుబుక్‌ కోసం 1,05,615 అర్జీలు వచ్చాయి. వాటి గడువు 45 రోజులు. తొలుత వారంపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో వీఆర్‌వో, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ ఆమోదముద్ర వేయా లి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికే 20 రోజులకు పైగా సమయం పడుతుందని రెవెన్యూవర్గాలే చెబుతున్నాయి. ఆ తర్వాత ప్రింటింగ్‌కు ఆమోదం తెలుపుతారు. ఇలా ఆమోదం పొందిన పట్టాదారు పాసుబుక్‌ ముద్రణ కోసం చెన్నైకి పంపిస్తారు. అక్కడ రాష్ట్రం మొత్తానికి కలిపి ఒకే ప్రింటింగ్‌ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకొన్నారు. ఈ కారణంగా నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ప్రస్తు తం గడువు తేదీ లోపు పరిష్కరించాల్సినవి 7,777 ఉండ గా గడువు తేదీ ముగిసిపోయినవి 3,958 వరకు ఉన్నట్లు సమాచారం.


పైసలిస్తేనేఫైలు ముందుకు..

రెవెన్యూ ప్రక్రియ పూర్తి కావడం కూడా ఒక ప్రహసనంగా మారింది. ఖర్చుల పేరుతో పలుచోట్ల సిబ్బంది చేయిచాస్తున్నట్లు ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధా నంగా రోజుల తరబడి తమ వద్దనే ఆమోదించకుండా అంటిపెట్టుకోవడం, తీరా గడువు తేదీ రాగానే ఏవేవో కారణాలు పేర్కొంటూ తిరస్క రిస్తున్నట్లు సమాచారం. పట్టా దారు పాసుపుస్తకం పొందేందుకు ఇప్పటికీ రెండుసార్లు దరఖాస్తు చేశాను... అయినా పాసుపుస్త కం చేతికి అందలేదని కరాలపాడు గ్రామాని కి చెందిన రామ కృష్ణ తెలిపారు.


జిల్లాలో పరిస్థితి ఇలా.. 

 గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల మండలాల్లో మ్యుటేషన్‌ జరగాలంటే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిందే. ఇప్పటివరకు 1,250కిపైగా దర ఖాస్తులు వివిధ కారణాలతో నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు 780కి పైగా దరఖాస్తులను ఎటువంటి కారణాలు లేకుండానే తిరస్క రించారు. మాచర్ల మండ లంలో మూడు నెల లుగా సర్వర్‌ అందు బాటు లో లేదు.  తెనాలి మండలంలో గత ఏ డాది కాలంలో 1,142 దరఖాస్తులు రాగా 591 అర్జీలను పరిష్కరించారు. వివిధ కారణాలతో 290 దరఖాస్తులను తిరస్కరించా రు. 82 పెండింగ్‌లో ఉన్నాయి. మూడు నెలల నుంచి ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రెండింటికి ఒక్కటే వెబ్‌సైట్‌ కావడంతో సర్వర్‌ సరిగా పనిచేయడం లేదని ఉద్యోగులు అంటున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాల కోసం 149 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు వేలల్లో నగదు వసూలు చేస్తున్నారని దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. తాడి కొండ మండలంలో 1,328 దరఖాస్తులు రాగా వాటిలో 526 దరఖాస్తులు ఆమోదించారు. 595 దరఖాస్తులు  తిర స్కరించారు. 192 దరఖాస్తులు ప్రాసెసింగ్‌లు ఉన్నాయి. మరో 15 దరఖాస్తుల గడువు ముగిసిపోయింది. వేమూరు మండలంలో 45 దరఖాస్తుల గడువు ముగిసినా ఎటువంటి  స్పందన లేదు.  పొన్నూరు మండలంలో 360 దరఖాస్తులు పెండింగ్‌లో న్నాయి. పట్టాదారు పాసుపుస్తకం కోసం ఆరునెలలుగా తిరుగుతున్నానని మాచవరం గ్రామానికి చెందిన బద్దెల సూర్యనారాయణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వినుకొండలో 735 దరఖాస్తులకు 107, నూజెండ్ల మండలంలో 321 గాను 197, బొల్లాపల్లి మండలంలో 910 దరఖాస్తులకు 550 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సత్తెనపల్లి రెవెన్యూ కార్యాలయ పరిధిలో 616 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. బాపట్లలో సుమారు 350 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.  రొంపిచర్ల మండలంలో 174 పట్టాదారు పుస్తకాలు రావాల్సి ఉంది. నరసరావుపేట మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వర్‌ పనిచేయక పోవడం వలన కొంత జాప్యం ఏర్పడుతోందని అధికారులు తెలిపారు.


Updated Date - 2020-12-14T05:00:30+05:30 IST