43 ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2020-12-25T05:32:38+05:30 IST

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 43పారా మెడికల్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్స్‌ పోస్టులను భర్తీచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

43 ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

గుంటూరు(మెడికల్‌), డిసెంబరు 24: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 43పారా మెడికల్‌ ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్స్‌ పోస్టులను భర్తీచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అభ్యర్థుల నియామకం జరుగుతుందని, కన్సాలిడేటెడ్‌ రెమ్యునరేషన్‌ నెలకు రూ.15వేలుగా ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి రెండో  తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు అందేవిధంగా తమ కార్యాలయానికి పంపుకోవాలని ఆమె వెల్లడించారు. 


Updated Date - 2020-12-25T05:32:38+05:30 IST