ఆరుపళ్ల విజేత చుండూరు ఎడ్లజత

ABN , First Publish Date - 2020-12-17T06:18:15+05:30 IST

పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా వీర్ల దేవాలయ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన తెలుగురాష్ట్రాల స్థాయి పోటీల్లో ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చుండూరుకు చెందిన అత్తోట శిరీష చౌదరి ఎడ్లజత 4658.10 అడుగుల దూరం బండను లాగి ప్రథమస్థానం సాధించింది.

ఆరుపళ్ల విజేత చుండూరు ఎడ్లజత
ప్రథమ బహుమతి సాధించిన ఎడ్లజతతో వెంకట్రామిరెడ్డి

కారంపూడి, డిసెంబరు 16: పల్నాటి వీరారాధన ఉత్సవాల సందర్భంగా వీర్ల దేవాలయ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన తెలుగురాష్ట్రాల స్థాయి పోటీల్లో ఆరుపళ్ల విభాగంలో ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చుండూరుకు చెందిన అత్తోట శిరీష చౌదరి ఎడ్లజత 4658.10 అడుగుల దూరం బండను లాగి ప్రథమస్థానం సాధించింది. అదే గ్రామానికి చెందిన శివకృష్ణచౌదరి ఎడ్లజత 4644.5 అడుగులతో ద్వితీయ స్థానం, గుంటూరు ఎన్జీవో కాలనీకి చెందిన కేశవ నాగిరెడ్డి ఎడ్లజత 4098.6 అడుగులతో తృతీయ స్థానం సాధించాయి. పెదకాకాని మండలం కొప్పురావూరుకు చెందిన కోట శ్రీనివాసరావు ఎడ్లజత 3900 అడుగులు, అమరావతి మండలం జిడుగుకు చెందిన బండి సాహిత్‌ ఎడ్లజత 3865.6 అడుగులు, కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన పోతినేని లక్ష్మణ్‌ చౌదరి ఎడ్లజత 3654.5 అడుగుల దూరం లాగి వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పోటీలను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు. విజేత ఎడ్లజతల యజమానులకు వెంకట్రామిరెడ్డి, బొమ్మిన అల్లయ్య, కొంగర సుబ్రహ్మణ్యం, మేకపోతు శ్రీనివాసరెడ్డిలు బహుమతులు అందజేశారు. 


Updated Date - 2020-12-17T06:18:15+05:30 IST