అన్నా.. నిను మరవం
ABN , First Publish Date - 2020-05-29T09:21:55+05:30 IST
రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని నేతలు ..

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్, మే 28: రాజకీయ చరిత్రలో సంక్షేమ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని నేతలు కొనియాడారు. నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని గురువారం జిల్లావ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు అధ్యక్షతన ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్సీ డాక్టర్ ఏఏస్ రామకృష్ణ, కోవెలమూడి రవీంద్ర పార్టీ జెండాను ఆవిష్కరించారు. మన్నవ సుబ్బారావు, ఎం.ధారునాయక్, మానుకొండ శివప్రసాద్, వెన్నా సాంబశివారెడ్డి, కంచర్ల శివరామయ్య, పోతురాజు ఉమాదేవి, పానకాల వెంకటమహాలక్ష్మి, కనపర్తి శ్రీనివాసరావు, క్రిస్టియన్‌సెల్ అధ్యక్షుడు మ్యాని, కసుకుర్తి హనుమంతరావు, ముత్తినేని రాజేష్, నాయుడు ఓంకార్, గుడిమెట్ల దయారత్నం, షేక్ చిన బాజి, ఉప్పలమర్తి లక్ష్మి, ఏవీరమణ, తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 37, 38, డివిజన్లలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు. సైదారావు, కన్నసాని నాగలక్ష్మి, ఎలుకా వీరాంజనేయులు, దొడ్డపనేని నరేంద్ర, చిన్న వెంకయ్య, పేరయ్య, కొమ్మినేని కోటేశ్వరరావు, వడ్లమూడి శ్రీనివాసరావు, తెలుగుయువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి తదితరుల పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత నాగళ్ల తిరపతయ్య నేతృత్వంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బృందావన్‌గార్డెన్స్‌లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలుగు జాతి గుండె చప్పుడు నందమూరి తారక రామారావు అని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ కొనియాడారు. ఎన్జీఆర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ఐల్యాండ్ సెంటర్లో, చేబ్రోలులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర పాలనలో నూతన సంస్కరణలు ప్రవేశపెట్టిన కారణజన్ముడు ఎన్టీఆర్ అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అభిమానినైన తాను టీడీపీలో శానసనభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నత స్థానాన్ని పొందానన్నారు. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా ఎన్టీఆర్ చాటి చెప్పారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు చోట్ల గురువారం ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం ఎన్టీఆర్తోనే ప్రారంభమైందన్నారు.