15 రోజులుగా గుడ్డు ఇవ్వడం లేదు
ABN , First Publish Date - 2020-02-08T09:31:11+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద పథకం క్షేత్రస్థాయిలో సవ్యంగా అమలు కావడంలేదు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి

- ఇసప్పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యేకు విద్యార్థుల ఫిర్యాదు
నరసరావుపేట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న గోరుముద్ద పథకం క్షేత్రస్థాయిలో సవ్యంగా అమలు కావడంలేదు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండలం లోని ఇసప్పాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశా లను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసినపుడు ఈ పథకంలో లోపాలు వెలుగులోకి వచ్చాయి. భోజనం రుచి, నాణ్యతపై విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులందరూ 15 రోజులుగా కోడిగుడ్డు పెట్టడం లేదని తెలిపారు. దీంతో ఆయన ఉపాధ్యాయులను, కుకింగ్ ఏజెన్సీ సభ్యులను నిలదీశారు. పైనుండి రావడం లేదని వారు చెప్పడంతో ఎంఈవో జ్యోతి కిరణ్, ఇతర విద్యాశాఖ ఉన్నతాదికారులతో ఫోన్లో మాట్లాడారు. కోడిగుడ్ల సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు.