నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు
ABN , First Publish Date - 2020-12-30T05:16:30+05:30 IST
కొవిడ్ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుక లకు అనుమతులు లేవని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
గుంటూరు, డిసెంబరు 29: కొవిడ్ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుక లకు అనుమతులు లేవని అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దుకాణాలు గురువారం రాత్రి 10 గంటలకు, బార్లను 11 గంటలకు, మద్యం దుకాణాలు 8 గంటలకు మూసివేయాలన్నారు. హోటళ్ళు, ఫంక్షన్ హాళ్లలో వేడుకలకు అనుమతులు లేవన్నారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చ రాదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుం టామన్నారు. 31న రాత్రి అర్బన్ పరిధిలో గస్తీ ముమ్మరంగా ఉంటుం దన్నారు. అన్ని ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు.