కొత్త జిల్లాలపై.. కసరత్తు
ABN , First Publish Date - 2020-11-03T14:16:02+05:30 IST
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం నుంచి..
భవనాలు, సరిహద్దులపై చర్చ
అధికారులతో కలెక్టర్ ఆనంద్‌కుమార్ భేటీ
ఇకపై ప్రతీ శనివారం భేటీ అవ్వాలని నిర్ణయం
సరిహద్దులు, ఆస్తులు, మౌలిక సదుపాయాలపై చర్చ
గుంటూరు(ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం నుంచి అందిన మార్గదర్శకాల మేరకు సమగ్ర వివరాలను నివేదించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలెక్టర్ ఆనంద్‌కుమార్ సోమవారం కలెక్టరే ట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశమై చర్చించారు. ప్రతీ పార్ల మెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసు కున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న గుంటూరు జిల్లా విభజన అనం తరం నరసరావుపేట, బాపట్ల జిల్లాలు కూడా ఏర్పాటవుతాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి పూర్తిస్థాయిలో కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.
నరసరావు పేట విషయంలో ప్రభుత్వ కార్యాలయా ల ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. గుం టూరు పార్లమెంట్ నియోజక వర్గంలో తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, తాడికొండ, మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయా, లేదా అనే దానిపై చర్చించారు. బాపట్ల కు సంబంధించి వేమూరు, రేపల్లె, బాప ట్ల నియోజకవర్గాలు మాత్రమే గుంటూ రు జిల్లా పరిఽధిలో ఉన్నాయి. దీనికి సంబంధించి హెడ్‌క్వార్టర్స్ బాపట్లలో ఏర్పాటు చేస్తారా/చీరాలలో ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. సమావేశం లో వివిధ శాఖలకు సంబంధించిన సొంత, అద్దెకు ఉన్న భవనాల వివరాలు కొంతవరకు సేకరించారు.
నాలుగు కమిటీల నియామకం
కొత్త జిల్లాల్లో కార్యాలయాల నిర్వహణకు వస్తు సామగ్రి, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, బీరువాలు, టేబుళ్లు, కుర్చీలు వంటివి అవసరం ఉన్నందున వాటి వివరాలు క్రోడీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఒకటో సబ్ కమిటీ జిల్లా సరిహద్దులు, రెగ్యు లేటరీ, లీగల్ అంశాలపై దృష్టి సారి స్తుంది. రెండో సబ్ కమిటీ స్ట్రక్చరల్ అండ్ పర్సనల్ రీఆర్గనైజేషన్, మూడో కమిటీ ఆస్తులు, మౌలిక సదుపాయాలు, నాల్గో సబ్ కమిటీ ఈ-ఆఫీసుకు సం బంధించి ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ కార్యకలాపాలు చేపడుతుంది. ఒకటి, మూడు సబ్ కమిటీలకు జేసీ (రైతు భరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్‌కుమార్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రెండో సబ్ కమిటీకి చైర్మన్‌గా జేసీ (సచివాలయా లు) పీ ప్రశాంతిని నియమించారు. నాల్గో సబ్ కమిటీకి జిల్లా రెవెన్యూ అధి కారిని చైర్మన్‌గా నియమించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇకపై ప్రతీ శనివా రం సాయంత్రం కమిటీ సమావేశం నిర్వహించి ఆ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎస్పీలు అమ్మిరెడ్డి, విశాల్ గున్ని, జేసీ ఏఎస్ దినేష్‌కుమార్, జడ్పీ సీఈవో చైతన్య, డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని, డీఎంహెచ్‌వో డాక్టర్ జే యాస్మిన్, జిల్లా ఖజానా ఉప సంచాల కుడు రాజగోపాల్‌రావు, రోడ్లు, భవనాల శాఖ ఎస్‌ఈ మాధవి సుకన్య, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితరులు హాజరయ్యారు.