పాల రైతుల సంక్షేమానికి కృషి

ABN , First Publish Date - 2020-11-26T04:26:01+05:30 IST

సహకార రంగంలోని సంగం డెయిరీ పాల రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు.

పాల రైతుల సంక్షేమానికి కృషి
పెద్దపాలెంలో పాలకేంద్రాన్ని ప్రారంభిస్తున్న సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ

సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ  

పొన్నూరు టౌన్‌, నవంబరు 25: సహకార రంగంలోని సంగం డెయిరీ పాల రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్‌ అన్నారు. పొన్నూరు మండలం పెదపాలెంలో బుధవారం పాలకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంగం డెయిరీ గత 40 ఏళ్లుగా జిల్లాలోని పాల ఉత్పత్తిదారుల సంక్షేమం, శ్రేయస్సు కోసం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో డెయిరీ డైరెక్టర్‌ బొర్రు రామారావు, మేనేజర్‌ కె.నరేష్‌ బాబు, ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్‌ బండ్లమూడి బాబురావు, తెలుగుయువత మండల అధ్యక్షుడు మువ్వ వెంకటకృష్ణ, మాజీ సర్పంచ్‌లు సముద్రాల ఆశీర్వాదం, ధూళిపాళ్ళ నాగేశ్వరరావు, స్థానిక టీడీపీ నాయకులు ముద్రబోయిన రాఘవయ్య, వల్లభాపురపు శ్రీనివాసరావు, చెల్లంశెట్టి సీతరామయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T04:26:01+05:30 IST