ఆర్‌యూబీలో బురదనీటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2020-11-13T05:36:28+05:30 IST

స్టేషన్‌ రోడ్డులోని ఆర్‌యూబీలో బురద నీటితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య శాశ్విత పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేశించారు.

ఆర్‌యూబీలో బురదనీటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలి
సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట, నవంబరు 12 : స్టేషన్‌ రోడ్డులోని ఆర్‌యూబీలో బురద నీటితో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య శాశ్విత పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేశించారు. గురువారం మునిసిపల్‌, రైల్యే అధికారులతో ఈ సమస్య పరిష్కారానికై ఆయన చర్చించారు. ఆర్‌యూబీలోని నీటి ఊట వస్తున్నదని, దీనిని నివారించాలని సూచించారు. ఫుట్‌పాత్‌ పక్కన కాలువ నిర్మించి నీటి ఊటను దీనిలోకి మళ్ళించాలని రైల్యే ఇంజనీర్‌  సూచించారని తెలిపారు. బాబాపేట వద్ద ప్రధాన మురుగు కాలువలో నీరు పారుదల సక్రమంగా లేదని ఈ కాలువ రైల్వే ట్రాక్‌ కింద ఉందని,  దీనిని పరిష్కరించాలని సూచించారు. చిలకలూరిపేట రోడ్డులో ఓవర్‌ బిడ్జి వద్ద పుట్‌ బ్రిడ్జి నిర్మించేందుకు రైల్యే శాఖ అనుమతు ఇవ్వాలన్నారు. సమావేశంలో రైల్వే ఇంజనీర్‌ వైవి సత్యనారాయణ, మునిసిపల్‌ కమీషనర్‌ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణంలోని 34వ వార్డు లోప్రజలతో ‘నాడు-ప్రజల కోసం నేడు’ కార్యక్రమంలో భాగంగా వార్డులో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు మిట్టపల్లి రమేష్‌, మోరబోయిన శ్రీనివాసరావు, మోరె రవీంద్రారెడ్డి, జాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-13T05:36:28+05:30 IST