-
-
Home » Andhra Pradesh » Guntur » narasaraopet
-
చరిత్రలో నిలిచే సాహితీ సేవకులు
ABN , First Publish Date - 2020-12-07T05:00:23+05:30 IST
భాషా సాహితీ, సంస్కృతులకు ఎవరైతే సేవ చేస్తారో వారే చరిత్రలో నిలిచిపోతారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాదు అన్నారు.

అధికార భాషా సంఘ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ
కొప్పరపు సోదరుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ
నరసరావుపేట కల్చరల్, డిసెంబరు 6: భాషా సాహితీ, సంస్కృతులకు ఎవరైతే సేవ చేస్తారో వారే చరిత్రలో నిలిచిపోతారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాదు అన్నారు. ఆదివారం స్థానిక భువనచంద్ర టౌన్‌హాల్‌లో కొప్పరపు సోదరుల కాంస్య విగ్రహ ఆవిష్కరణకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన జలగం వెంగళరావు, తెలుగు అకాడమీని స్థాపించిన పీవీ నరసింహారావు, ఆంధ్ర భాషా సమితిని స్థాపించిన బెజవాడ గోపాలరెడ్డి, తెలుగు భాషకు ఎనలేని సేవలందించిన నందమూరి తారక రామారావు, తెలుగుకు ప్రాచీన భాషా హోదాను సాధించిన వైఎస్‌ఆర్, తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రాన్ని నెల్లూరు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్, దీని కోసం కృషి చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ భాషా సంస్కృతులను ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కొప్పరపు సోదరుల కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసుకోవటం పట్టణానికి చెందిన గర్వకారణమన్నారు. కొప్పరపు సోదరుల మనువడు మాశర్మ, పత్రికా సంపాదకుడు రామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.