అంబేద్కర్‌ విగ్రహాల మాయం వెనుక ఎవరున్నారో తేల్చాలి: మాజీ మంత్రి

ABN , First Publish Date - 2020-09-06T14:46:23+05:30 IST

శాఖమూరులో నిర్మాణం లో ఉన్న అంబేద్కర్‌ స్మృతివనంలో నాలుగు అంబేద్కర్‌ విగ్రహాలు..

అంబేద్కర్‌ విగ్రహాల మాయం వెనుక ఎవరున్నారో తేల్చాలి: మాజీ మంత్రి

గుంటూరు(ఆంధ్రజ్యోతి): శాఖమూరులో నిర్మాణం లో ఉన్న  అంబేద్కర్‌ స్మృతివనంలో నాలుగు అంబేద్కర్‌ విగ్రహాలు మాయం వెనుక ఎవరు ఉన్నారో తక్షణం తేల్చాలని  మాజీ మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. దళితులపై దాడులు, అకృత్యాలు చేస్తున్నారు కాబట్టే పాలకులను ఈ విషయంలో తప్పుట్టాల్సి  వస్తోందన్నారు.  అంబేద్కర్‌ స్మృతివనం ప్రాజెక్ట్‌ నిర్మాణం విషయంలో ప్రభుత్వం తొలినుంచి కుట్ర పూరితంగానే వ్యవహరి స్తోందని అన్నారు. అంబేద్కర్‌ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం టీడీపీ ప్రభుత్వం రూ.136 కోట్లతో స్మృతివనం పనుల్ని ప్రారంభించిందని తెలిపారు. సృతివనం పనులు ఆపడాన్ని  సహించం అని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-06T14:46:23+05:30 IST