ఇసుకంతా.. ఆ ముగ్గురికే..
ABN , First Publish Date - 2020-09-20T14:29:40+05:30 IST
జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది... సిండికేట్లు చక్రం తిప్పుతున్నారు..

27 లారీలకు నిరంతరం లోడింగ్
నకిలీ బిల్లులతో ఇసుక స్వాహా
నాయుడుపేట డంపింగ్ యార్డులో మాయాజాలం !
రూ. 5వేలు అదనంగా ఇస్తే క్షణాల్లో సరఫరా
వారికి కొమ్ముకాస్తున్నారంటూ సెబ్ ఎస్ఐపై ఆరోపణలు
పోలీసుల అదుపులో ఇద్దరు..!
గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది... సిండికేట్లు చక్రం తిప్పుతున్నారు. నాయుడుపేట ఇసుక యార్డు నుంచి కేవలం 27 లారీలకు మాత్రమే ఇసుక లోడింగ్ చేస్తు న్నారు. సొంతగానే బిల్లులు తయారు చేసి ఇసుక స్వాహా చేస్తున్నా సెబ్ అధికారులు నోరెత్తడం లేదు. వారికి కొమ్ము కాస్తున్నారంటూ ఓ సెబ్ ఎస్ఐపై ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై పోలీ సులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరిని అదుపులోకి తీసు కున్నట్లు సమాచారం.
నాయుడుపేట డంపింగ్ యార్డులో అవినీతి చక్ర వర్తులదే రాజ్యం.. దానికి సెబ్ (ఎస్ఈబీ) అధికారుల అండదండలు కూడా తోడవడంతో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. కేవలం 27 లారీలకు మాత్రమే నిరంతరం లోడింగ్ చేస్తున్నారు. గోరంట్లలోని ఒకరికి చెందిన 14 లారీలు, నగరా లలోకి ఒకరికి చెందిన 5 లారీలు, అదే ప్రాంతంలోని మరొకరికి చెందిన 9 లారీలు ఇక్కడ నిరంతరం లోడింగ్‌లు జరుపుకొంటున్నాయి.మిగిలిన వారికి అవకాశం ఇచ్చే ప్రశ్నే లేదు. గతంలో నల్లపాడు పీఎస్‌లో ఎస్ఐగా చేసి ప్రస్తుతం సెబ్‌లో చేస్తున్న ఎస్ఐ కూడా వీరికి సహ కరిస్తున్నట్లు ఇతర లారీల డ్రైవర్లు వాపోతున్నారు.
అయితే బహిరంగంగా చెబితే దాడులు ఎదుర్కో వలసి వస్తుందని భయ పడుతున్నారు. దీంతో ఉన్న తాధికారులకు రహ స్యంగా ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఒక కారులో కూర్చొని ప్రైవేటు కంప్యూటర్ను ఏర్పా టు చేసుకొని సొంతగానే బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోప ణలు ఉన్నాయి. పోలీసులు తనిఖీ చేస్తే ఆ బిల్లులు చూపిస్తున్నారని, అయితే అవి నకిలీ బిల్లులని సెబ్ అధికారులకు తెలిసినా నోరెత్తడం లేదని ఆరోపి స్తున్నారు. ప్రైవేటు కంప్యూటర్లో బిల్లులు మం జూరు కాని పక్షంలో చేతితోనే బిల్లులు రాస్తున్నారని శనివారం ఉన్నతాధికారుల తనిఖీల్లో బయట పడినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలి సింది. అయితే అఽధికారులు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదు. కేవలం వైసీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు చెందిన లారీలకే లోడింగ్‌లు ఇస్తున్నారని, నగరాలకు చెందిన ఓ భవన నిర్మాణ ముడి సరు కును సరఫరా చేసే వ్యక్తి రూ.5వేలు అద నంగా తీసుకొని ఈ 28 లారీల ద్వారా గంటల వ్యవదిలో ఇసుకను సరఫరా చేస్తున్నట్లు కూడా గుర్తిం చినట్లు తెలిసింది.
ఇదే యార్డులో గతంలో పలు అవకతవకలు గుర్తించి వారిపై చర్యలు తీసుకు న్నారు. నెల తిరగకుండానే ఇసుక మాఫియా సిండి కేట్లు మళ్లీ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఒక వైపు గుంటూరు నగరంలోనే జరుపుతున్న నిర్మా ణాలకు ఇసుక అనుకున్న సమయానికి సరఫరా లేదు... ఉన్నా అదనపు ధరలు..! కానీ నాయుడుపేట యార్డులో మాత్రం రూ.5వేలు అదనంగా ఇస్తే గంటల వ్యవధిలో ఇసుక వస్తున్నట్లు అక్కడ ఇతర లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి అందరికీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నారు.