వాయిదా కాదు... రద్దుచేయండి
ABN , First Publish Date - 2020-03-16T07:16:00+05:30 IST
రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత దుర్మార్గంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు.
దుర్మార్గమైన పద్ధతిలో నామినేషన్ల ఉపసంహరణ
ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ
గుంటూరు(సంగడిగుంట), మార్చి 15: రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత దుర్మార్గంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరిగిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలువాయిదా కాదని పూర్తిగా రద్దుచేయాలని డిమాండ్ చేశా రు. తిరిగి నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కేంద్రఎన్నికల కమిషన్ ప్రత్యక్ష పర్యవేక్షణలోనే ఎన్నికలు జరగాలన్నారు. తమపార్టీ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని గతంలోనే విజ్ఞప్తి చేసిందన్నారు.
వైసీ పీ ఎన్నికల కార్యక్రమాన్ని ఖూనీ చేసిందన్నారు. ప్రతిపక్ష అభ్యర్థుల ఇళ్ళ ల్లో మద్యం పెట్టి వారే పోలీసులకు పట్టించి జైళ్ళకు పంపించే అత్యంత దుర్మార్గమైన క్రీడ ఏపీ లోనే చూ స్తున్నామన్నారు. ఏ ఒక్క ఉపసంహరణ కూడా స్వచ్ఛందంగా జరగలేదన్నారు. హత్యాయత్నం చేసినవారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మంత్రులపై పెట్టిన ఒత్తిళ్ళు కూడా ఈ పరిస్థితికి కారణమన్నారు. సోమవారం రాజధాని ప్రాంతంలో సీపీఐ బృందం పర్యటిస్తుందన్నారు. సమా వేశంలో జంగాల అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.