గ్రంధసిరిలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-12-31T05:16:48+05:30 IST

మండలంలోని గ్రంథసిరి గ్రామంలో కిలారి నాగేశ్వరరావు(45) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు.

గ్రంధసిరిలో వ్యక్తి దారుణ హత్య
కిలారి నాగేశ్వరరావు (ఫైల్‌)

అచ్చంపేట, డిసెంబరు 30 : మండలంలోని గ్రంథసిరి గ్రామంలో కిలారి నాగేశ్వరరావు(45) అనే వ్యక్తి బుధవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  నాగేశ్వరరావు ముప్పాళ్ళ మండలం పమిడిపాడు గ్రామం నుంచి బతుకు తెరువు నిమిత్తం గ్రంధసిరికి 15 ఏళ్ల క్రితం కుటుంబంతో వచ్చాడు. బంధువైన కిలారి నాగేశ్వరరావు స్థలంలో ఇల్లు నిర్మించుకుని కూరగాయాల వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్థలాన్ని ఖాళీ చేసే విషయంలో వీరిద్దరి మధ్య వివాదం నెలకుంది. ఈ క్రమంలో వ్యసనపరుడైన సమీప బంధువు జంపని నాగేశ్వరరావు కత్తితో దాడి చేసి హతమార్చి ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఆనంద్‌ తెలిపారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హతుడుకి భార్య లక్ష్మీనరసమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - 2020-12-31T05:16:48+05:30 IST