-
-
Home » Andhra Pradesh » Guntur » murder
-
హత్య కుట్ర భగ్నం
ABN , First Publish Date - 2020-11-28T05:20:34+05:30 IST
ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిని హత్య చేసేందుకు నిందితులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం
తాడేపల్లి టౌన్, నవంబరు 27: ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల కారణంగా ఓ వ్యక్తిని హత్య చేసేందుకు నిందితులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, డీఎస్పీ దుర్గాప్రసాద్‌తో కలిసి శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్‌కు చెందిన మద్దికట్ల చంద్రశేఖర్ ఆటోలు, కార్లు బాడుగకు తిప్పుతూ జీవిస్తుంటాడు. అతని వద్ద తాడేపల్లి పట్టణానికి చెందిన ముచ్చురాజు ద్వారా పెనుమాకకు చెందిన సతీష్‌నాయుడు అనే వ్యక్తి రూ.13.5లక్షలు అప్పు తీసుకున్నాడు. సతీష్‌నాయుడు ఎన్నిసార్లు అడిగినా చంద్రశేఖర్‌కు డబ్బులు ఇవ్వకపోవడంతో సతీష్‌నాయుడిని చంపాలని, ముచ్చురాజు, విజయవాడ పటమటకు చెందిన బొప్పన రాజ్‌కుమార్ నిర్ణయించారు. మారణాయుధాలు, కారం పొట్లాలు తీసుకుని 27 తెల్లవారుజామున ఉండవల్లి సెంటర్‌లో పెనుమాక వెళ్లే ఆటోకోసం ఎదురుచూస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య కుట్ర విషయం వెల్లడైందని చెప్పారు. కేసును ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐలు అంకమ్మరావు, సుబ్రహ్మణ్యం, తాడేపల్లి పోలీసు స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు.