-
-
Home » Andhra Pradesh » Guntur » muncipal commissionar toor at city
-
రహదారుల మరమత్తులు పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-19T05:43:38+05:30 IST
నగరంలో రహదారుల మరమ్మతులు ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్ చల్లా అనురాధ ఇంజనీరింగ్ అధికార్లను ఆదేశించారు.

నగర కమిషనర్ చల్లా అనురాధ
గుంటూరు(కార్పొరేషన్), డిసెంబరు 18: నగరంలో రహదారుల మరమ్మతులు ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్ చల్లా అనురాధ ఇంజనీరింగ్ అధికార్లను ఆదేశించారు. విజయవాడ రోడ్ వై జంక్షన్, పొన్నూరు రోడ్ లోని విండ్రో కంపోస్ట్ యూనిట్ లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పెయింటింగ్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఐల్యాండ్‌లో మొక్కలను నాటాలని, విద్యుత్ స్తంభాలను తొలగించాలని అధికార్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీహెచ్ చంద్రశేఖర్, ఏఈ దుర్గా ప్రసాద్, టీపీఎస్ స్రవంతి, వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు షాపింగ్ మాల్స్, హోటల్స్ తమ సంస్థ ప్రకటనలు ఓ వైపు, మరోవైపు ప్లాస్టిక్ నిషేధ నిబంధనలు ఉండేలా సంచులను తయారుచేసి వినియోగదారులకు అందించాలన్నారు. నిషేధిత సంచులు వినియోగిస్తే భారీ మొత్తంలో అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు.