హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలి

ABN , First Publish Date - 2020-12-19T05:51:07+05:30 IST

మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని మున్సిపల్‌ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వై.నేతాజి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 18: మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని మున్సిపల్‌ ఎంప్లాయిస్‌, వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వై.నేతాజి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గాంధీ పార్క్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో నేతాజీ మాట్లాడుతూ 21న కలెక్టరేట్‌ వద్ద జరిగే వంటావార్పు కార్యక్రమంలో కార్మికులు  పాల్గొనాలన్నారు. అనంతరం యూనియన్‌ నగర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పేటేటి యాకోబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గట్టా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా ముత్యాలరావు, మరో 25 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు.  


Read more