కాలనీ దత్తత అభినందనీయం

ABN , First Publish Date - 2020-12-16T04:43:40+05:30 IST

నగరంలోని శివారు ప్రాంతాలను స్థానిక ప్రజలే సొసైటీలుగా ఏర్పడి అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు.

కాలనీ దత్తత అభినందనీయం
కాలనీలో రోడ్డును పరిశీలిస్తున్న కమిషనర్‌

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 15: నగరంలోని శివారు ప్రాంతాలను స్థానిక ప్రజలే సొసైటీలుగా ఏర్పడి అభివృద్ధి చేసుకోవడం అభినందనీయమని నగర కమిషనర్‌ చల్లా అనురాధ  తెలిపారు. స్థానిక శ్యామలానగర్‌ ఎక్స్‌టెన్షన్‌, బంజరానాయక్‌ కాలనీ ప్రాంతాలను మంగళవారం కమిషనర్‌  పరిశీలించారు.  బంజారానాయక్‌ కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్న డాక్టర్‌ నరేంద్రరెడ్డిని అభినందించారు. ఈ స్ఫూర్తితో ఇతర ప్రాంత ప్రజలు కూడా సొసైటీలు, కమిటీలుగా ఏర్పడి ఆయా ప్రాంతాలను అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మద్యవిమోచన కమిటీ చైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి, డాక్టర్‌ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T04:43:40+05:30 IST