-
-
Home » Andhra Pradesh » Guntur » mrps leader manda krishna madiga
-
మాలమాదిగల మధ్య ఘర్షణలు దురదృష్టకరం: మందకృష్ణ
ABN , First Publish Date - 2020-12-30T17:32:14+05:30 IST
వెలగపూడిలో దళితుల మద్యే ఘర్షణ ఆవేదనకు గురిచేస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు

గుంటూరు: వెలగపూడిలో దళితుల మద్యే ఘర్షణ ఆవేదనకు గురిచేస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. రెండు వర్గాలు సమన్వయంతో ముందు సాగాలని విజ్ఞప్తి చేశారు. మృతురాలు మరియమ్మ మృతికి ఎమ్మార్పిఎస్ తరుపున సంతాపం తెలిపారు. కారంచేడు ఘటనలో మాదిగలు హత్యకు గురైన మాలలు అండగా నిలిచారని గుర్తు చేశారు. చుండూరు లో మాలలు హత్యకు గురైతే మాదిగలు అండగా పోరాడారన్నారు. శ్రీకాకుళంలో మాలలను హత్య చేస్తే ఎంఆర్పీఎస్ అండగా నిలిచి పోరాటం చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి అంశంలో ఐక్యతతో మాలమాదిగలు ముందుకు సాగుతున్నారన్నారు. మాల మాదిగల మధ్య ఘర్షణలు దురదృష్టకరమని తెలిపారు.
వర్గీకరణ పోరాటానికి 26 ఏళ్ళు పట్టిందని... లక్ష్య సాధనకు మాదిగలు, అడ్డుకోవడానికి మాలలు ఎన్నో ఉద్యమాలు చేశారని చెప్పుకొచ్చారు. వర్గీకరణ పోరాటంలో మాదిగలపై మాలలు దాడి చేసినా లక్ష్యం కోసం సంయమనం పాటించామన్నారు. అంబేద్కర్, జగజ్జీవన్‌రావులు దళితులందరికి నేతలన్నారు. మాలమహానాడు నేతలను వెలగపూడికి అవకాశం ఇచ్చిన పోలీసులు ఎమ్మార్పీఎస్ నేతలకు ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. మాల మాదిగల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తానని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.