పిల్లలకు, మహిళలకు దిశ చట్టంతో రక్ష

ABN , First Publish Date - 2020-12-11T06:18:23+05:30 IST

పిల్లలు, మహిళలపై జరుగుతోన్న నేరాలను కట్టడి చేయటానికి, వారికి రక్షణగా నిలిచేందుకు దిశ చట్టం ఉపకరిస్తుందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

పిల్లలకు, మహిళలకు దిశ చట్టంతో రక్ష

గుంటూరు, డిసెంబరు 10: పిల్లలు, మహిళలపై జరుగుతోన్న నేరాలను కట్టడి చేయటానికి, వారికి రక్షణగా నిలిచేందుకు దిశ చట్టం ఉపకరిస్తుందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మానవ హక్కుల దినం సందర్భంగా ఆన్‌లైన్‌లో పిల్లల అక్రమ రవాణా అంశంపై బేటీ బచపన్‌ ఆందోళన వారి ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఇండో నేపాల్‌ సంభాషణ కార్యక్రమంలో గుంటూరు నుంచి ఎంపీ మాట్లాడారు. చట్టాన్ని పరిశీలించి, మహిళల అక్రమ రవాణా అధికంగా ఉండే నేపాల్‌ దేశంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని చర్చలో ఎంపీ సూచించారు. నేపాల్‌ నుంచి మన సరిహద్దులకు అధికంగా పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నట్లు వివరించారు.  


Updated Date - 2020-12-11T06:18:23+05:30 IST