అండర్‌గ్రౌండ్‌ పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-16T04:18:03+05:30 IST

నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్‌గ్రౌండ్‌ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించారు.

అండర్‌గ్రౌండ్‌ పనులు పూర్తి చేయాలి
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎంపీ అయోధ్య, పక్కన కమిషనర్‌ అనురాధ

ఎంపీ అయోధ్య రామిరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 15: నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్‌గ్రౌండ్‌ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించారు. యూజీడీ పనుల పురోగతిపై మంగళవారం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో కమిషనర్‌ చల్లా అనురాధ, షాపూర్జి పల్లోంజి కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇదుకోసం యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈలు శ్రీనివాసరావు, రవికృష్ణరాజు, ఈఈ సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2020-12-16T04:18:03+05:30 IST