ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నర్సుల ఆందోళన: ఎంపీ గల్లా జయదేవ్
ABN , First Publish Date - 2020-07-27T12:57:56+05:30 IST
తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే..

గుంటూరు(ఆంధ్రజ్యోతి): తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎంపీ గల్లా జయదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని నర్సులు విధులు బహిష్కరించే పరిస్థితి రావటం దారుణమన్నారు. మొదటి నుంచి కరోనాపై అలసత్వం ప్రదర్శిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో అండగా ఉండాల్సిన ప్రభుత్వం సిబ్బంది త్యాగాలను విస్మరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నాలుగు నెలల ముందే కరోనా చికిత్స పరికరాల కోసం రూ.2.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సరైన సమయంలో నిధులు ఇచ్చినా వాటిని ఉపయోగించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందన్నారు.