-
-
Home » Andhra Pradesh » Guntur » More corona examination should be done
-
ఎక్కువ కరోన పరీక్షలు చేయాలి
ABN , First Publish Date - 2020-05-18T09:39:02+05:30 IST
కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఏఎస్

జేసీ ఏఎస్ దినేష్‌కుమార్ ఆదేశాలు
గుంటూరు, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఏఎస్ దినేస్‌కుమార్ ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ స్టాండర్డ్ ఆపరేషన్ ప్లాన్ ప్రకారం కుటుంబంలో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా ఆ కుటంబ సభ్యులందరికి పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి గ్రామస్థాయి వరకు పర్యవేక్షణ చేయడానికి జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్‌లలో అధికారులతో బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్ స్థాయి సర్వైలెన్స్ టీమ్‌లను క్రియాశీలకంగా పని చేసేలా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ లక్షణాలున్న వారిని పరీక్షలు నిర్వహించే వరకు ఐసోలేషన్‌లోనే ఉంచాలని స్పష్టం చేశారు.
స్వాబ్ టెస్టింగ్ కోసం ప్రస్తుతం ఐదుమంది సిబ్బంది టీమ్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక నుంచి మెడికల్ ఆఫీసర్, స్టాఫ్‌నర్స్, నాల్గో తరగతి సిబ్బంది మొత్తం ముగ్గురితోనే టీమ్ పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆ విధంగా స్వాబ్ తీసుకొనే టీమ్‌లను పెంచాలని డీఎంహెచ్‌వో డాక్టర్ యాస్మిన్‌ని ఆదేశించారు. సమావేశంలో జేసీ(సచివాలయాలు) పి.ప్రశాంతి, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారపురెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కొండయ్య, డాక్టర్ రాజునాయుడు, డాక్టర్ ఈశ్వర్‌ప్రసాద్, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.