గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ళ స్థలాల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-27T05:24:28+05:30 IST

దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లో 30.75 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ జరుగుతున్నదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ళ స్థలాల పంపిణీ
ఇళ్ళ స్ధలాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి 

నరసరావుపేట, డిసెంబరు 26 : దేశంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం లో 30.75 లక్షల మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ జరుగుతున్నదని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. నరసరావుపేట పట్టణ లబ్ధిదారుల కోసం ఉప్పలపాడు వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను ఉమ్మారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శనివారం పరిశీలించారు. ఇళ్ళ స్థలాల పంపిణీతో 17వేల కొత్త టౌన్‌ షిప్‌లు ఏర్పాటు అవుతున్నాయని ఉమ్మారెడ్డి తెలిపారు.  రూ.20 వేల కోట్లు స్థలాలకు ఖర్చు అవుతున్నదన్నారు. వీటిలో ఇళ్ళ నిర్మాణానికి అంచనా వేస్తే రూ.51 వేల కోట్లు అవసరమని అధికారులు నివేదికలు సిద్ధం చేశారన్నారు. ఉప్పలపాడు వద్ద 6,400 మందికి ఇళ్ళ స్థలాల పంపిణీ జనవరి 3న జరుగుతుందని డాక్టర్‌ గోపిరెడ్డి తెలిపారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి, తహసీల్దార్‌ రమణనాయక్‌, ఎంఈ కె.రామ్మోహనరావు, ఎంపీడీవో బూచిరెడ్డి పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:24:28+05:30 IST